కాపులపై 9 నెలల్లో నివేదిక..
posted on Feb 4, 2016 @ 11:13AM
కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై జస్టిస్ మంజునాథ్ కమిషన్ 9 నెలల్లో నివేదిక ఇస్తుందని.. ప్రస్తుతం కాపు కమిషన్లో జస్టిస్ మంజునాథ్ ఒక్కడే ఉన్నాడని.. ఇంకా ముగ్గురు, నలుగురు సభ్యులను నియామించాల్సిన అవసరం ఉందని.. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలో రూపొందిస్తామని..స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీ బీసీ రిజర్వేషన్ 4 కేటగిరీలలో మొత్తం 144 కులాల వారున్నారని.. కాపులను ఏ కేటగిరిలో చేర్చాలనేది కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు. కాగా కాపు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ్ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ కానున్నారు.