30 లక్షల డెబిట్ కార్డుల వివరాలు.. డేంజర్ జోన్ లో
posted on Oct 20, 2016 @ 12:09PM
దాదాపు 30 లక్షల డెబిట్ కార్డుల వివరాలు డేంజర్లో ఉన్నాయని.. డెబిట్ కార్డుల వివరాలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయానని చెబుతున్నాయి బ్యాంకు వర్గాలు. అందుకే ప్రతి ఒక్కరూ ఏటిఎం పిన్ నెంబరు మార్చుకోవాలని.. లేక కొత్త కార్డు తీసుకోవాలని సూచించాయి. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులకు ముప్పు పొంచి ఉన్నట్టు..యస్ బ్యాంకుకు చెందిన ఖాతాదారుల్లో అత్యధికుల వివరాలు బయటకు పొక్కిన తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తాము ఆరున్నర లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేశామని.. వారికి కొత్త కార్డులను ఇవ్వనున్నట్టు తెలిపింది. మిగతా బ్యాంకులు మాత్రం దీనిపై స్పందించలేదు. దేశవ్యాప్తంగా 69.7 కోట్ల డెబిట్ కార్డులు ఉన్నట్లు సెంట్రల్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. ముప్పు పొంచి ఉన్న కార్డుల్లో 26 లక్షలు వీసా, మాస్టర్‌కార్డ్‌కు చెందినవి కాగా.. 6 లక్షలు రూపేకి చెందినవిగా బ్యాంకు వర్గాలు తెలిపాయి.