గుజరాత్ ప్రభుత్వంపై తూర్పు మత్స్యకారులు ఆగ్రహం
posted on Apr 16, 2012 @ 5:33PM
కృష్ణ గోదావరి బేసిన్ లో తిష్టవేసి నిత్యం కోట్లాది రూపాయల విలువైన ముడిచమురు, సహజవాయువును తరలించిపోతున్న గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పోరేషన్ పై తూర్పుగోదావరి జిల్లా మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ కే.జి బేసిన్లో డ్రిల్లింగ్ ప్రారంబించి ఆ తరువాత గ్యాస్ , చమురు రవాణాకు చేసిన ఏర్పట్లువల్ల తమకు అపారంగా నష్టం కాలుగుతోందని తూర్పు గోదావరిజిల్లా మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ డ్రిల్లింగ్ కార్యకాలపల వాళ్ళ 26 రకాల మత్స్యసంపద తమ ప్రాంతం నుండి తరలిపోయిందని, పలితంగా తమ జీవనోపాధికి గండిపడిందని మత్స్యకారులు ఆరోపిస్తునారు. ఈ మత్స్యసంపద తరలి పోయిన విషయాన్ని రాష్ట్రమత్స్య శాఖ కూడా ధృవీకరిచింది. డ్రిల్లింగ్ సందర్బంగా వస్తున్న శబ్దాలు, పలు రకాల భారి నౌకల రాఖపోకల వల్ల మత్స్యసంపద చెల్లాచెదురై ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లి పోతున్నాయి మత్స్యకారులు అంటున్నారు. తమకు జరుగుతున్న నష్టానికి పరిహారం అందజేయకపోతే గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పోరేషన్ కార్యకలాపాలను ఆడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నెలాఖరు లోపుగా తమకు పరిహారం అందజేయకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని వారు అంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.