మంత్రి రఘువీరాకు ఝలక్ ఇచ్చిన అన౦త డిసిసి అధ్యక్షుడు
posted on Apr 16, 2012 @ 4:43PM
రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డికి అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు మధుసూదన్ గుప్తా షాక్ ఇచ్చారు. గుప్తా ఇటివలే రఘువీరా ఆశీస్సులతో డిసిసి అధ్యక్షునిగా ఎన్నికయారు. అయితే గుప్తా పదవిబాధ్యతులు స్వీకరించిన వెంటనే రఘువీరాకు ప్రత్యర్ది అయిన మాజీమంత్రి జె.సి. దీవాకర్ రెడ్డి ఆశీస్సులు కోసం వెళ్లారు. ఇది రఘువీరారెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.రఘువీరారెడ్డి, జె.సి. దీవాకర్ రెడ్డి మధ్య అనంతపురం జిల్లాలో చాల కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ వార్ లో గుప్తా కూడా రఘువీరా పక్షాన్నే ఉన్నారు. దివాకర్ రెడ్డి మంత్రి పదవి రాకుండా చేయటానికి గతంలో గుప్తా ఆయన పై అనేక పిర్యాదులు కూడా అధిష్టానానికి పంపించారు. అయితే తన ఆశిస్సులతో పదవి దక్కించుకున్న గుప్తా ప్లేటు పిరాంచడం దివాకర్ రెడ్డి ఆశిస్సులకోసం వెళ్లడం రఘువీరాకు దిగ్బ్రాంతినీ కలగించింది. దీంతో రఘువీరా గుప్తాను వివరణ కోరగా తన కేవలం మర్యాద పూర్వకాంగానే కలిసినట్లు తెలిసింది. కానీ , ఈ వివరణతో రఘువీరా సంతృప్తి చెందినట్లు కనిపించడం లేదు.