ఎంహెచ్17 కూల్చివేతపై అంతర్జాతీయ దర్యాప్తు..!
posted on Jul 19, 2014 @ 9:59AM
విమాన కూల్చివేత ఘటనపై ప్రపంచదేశాలు విస్మయం వ్యక్తం చేశాయి. కూల్చివేతపై నిష్పాక్షికంగా అంతర్జాతీయ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ గగనతలంపైనే విమానంపై దాడి జరిగింది. ఈ ఘటనకు ఉక్రెయినే బాధ్యత వహించాలి అని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నెదర్లాండ్స్, మలేసియా, ఉక్రెయిన్ దేశాధినేతలతో ఫోన్‌లో మాట్లాడారు.
అంతర్జాతీయ దర్యాప్తు జరిపేందుకు వీలుగా విమానశకలాలన్నింటినీ ఉక్రెయిన్‌లోనే ఉంచాలని ఆయన కోరారు. భారతప్రధాని నరేంద్రమోడీ విమానకూల్చివేత ఘటనను ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. కేంద్రవిమానయాన మంత్రి అశోకగజపతిరాజు ఈ సంఘటన దురదృష్టకరమని అన్నారు. దేశంలోని ఏ విమానయానసంస్థ కూడా ఉక్రెయిన్ గగనతలం మీదుగా విమానాలు నడపడంలేదని తెలిపారు.