జగన్ కు షాక్: టిడిపిలోకి వైకాపా ఎంపీలు
posted on Jul 19, 2014 @ 10:54AM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలను గమనిస్తుంటే త్వరలోనే ఆ పార్టీనేతలు జగన్ కు గట్టి ఝలక్ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ పార్టీ నాయకులకు ఏ మాత్రం విలువ ఇవ్వరని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని అంటున్నారు. ఇప్పటికే నంధ్యాల ఎంపీ పార్టీని వీడారు. కర్నూలు ఎంపీ పార్టీలో ఉంటున్నట్లు చెప్పినా అక్కడ పార్టీ బాధ్యతలు వేరేవారికి అప్పగించారు. ఆమె అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. ఇక తాజాగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత పార్టీ నాయకత్వం తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఆమె కర్నూలు ఎంపీ బుట్టా రేణుకతో కలిసి త్వరలో టిడిపిలో చేరుతారని సమాచారం. ఈ వ్యవహారంపై ఇటీవల వైసీపీకి చెందిన ఓ ఎంపీ, టీడీపీ నేత సీఎం రమేష్‌తో మంతనాలు సాగించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో లోక్‌సభ సభ్యత్వాలకు ఇబ్బందిలేకుండా న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇందుకు సంబంధించి బీజేపీకి చెందిన ఓ నేత వీరికి సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.