శవంతో వ్యాపారం చేస్తున్న ఎంజీఎం మార్చురీ సిబ్బంది...
posted on Oct 23, 2019 @ 12:26PM
వైద్యో నారాయణో హరి అంటారు పెద్దలు.కానీ ఇక్కడ జరిగే ఈ వ్యాపారం చూస్తుంటే ఇంత దారుణమా అనే అందరిలో ఒక భయం పుట్టుకొస్తుంది. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా ఉన్న వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రి ప్రాంగణంలోని పోస్టుమార్టం విభాగానికి వివిధ జిల్లాల్లో అనేక ప్రమాదాల్లో వివిధ కారణాల చేత మృతి చెందిన శవాలకు రోజుకు సుమారు పది నుండి పదిహేను మృతదేహాలకు పోస్టుమార్టమ్ చేయాల్సిన పరిస్థితులుంటాయి. ఇవి కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్. కొన్ని సందర్భాల్లో నిజాంబాద్ జిల్లాకు చెందిన మెడికో లీగల్ కేసులకు సంబంధించిన పార్థివ దేహాలను వారి మృతికి గల కారణాలను వెలుగులోకి తేవడానికి పోస్టు మార్టం నిమిత్తం ఇక్కడికి తీసుకు వస్తారు. ఇక్కడ ఆరుగురు ఫోరెన్సిక్ వైద్యులు ఉండాల్సింది ఇద్దరే ఉన్నారు. వీరిలో ఒకరు డెప్యుటేషన్ పై వచ్చిన వైద్యులే కావడంతో పోస్టుమార్టం కేసులో చేయడంలో కింద స్థాయి సిబ్బంది చేతివాటంతో మృతుల బంధువులు ఏం చేయాలో తెలియని స్థితిలో వారు ఏం చెబితే అదే జరుగుతుంది.
ఇక్కడ సమస్యలకు కొదవులేదు, ఎలకలు రాజ్యమేలతాయి, శవాలను పెట్టేందుకు ఫ్రీజర్ కొరత ఉంది, పారిశుద్ధ్యాన్ని పట్టించుకోరు. అయితే ఇక్కడ జరుగుతుంది మాత్రం మృతుని బంధువులకు తీరని శోకాన్ని మిగల్చటమే కాక ఆర్ధికపరమైన సమస్యను తెచ్చిపెట్టి ఉండటంతో పోస్టు మార్టం చేసిన పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి సిబ్బంది అడుగుతున్న లంఛాలు వేళల్లో ఇవ్వలేక తమ పేదరికాన్ని బయటపెట్టుకోలేక అనేక అవస్థలు పడుతున్నారు. ఒక దశలో అప్పు చేసి ఖర్చులకు తెచ్చుకున్న డబ్బులు పోస్టుమర్టం చేసే సిబ్బందికి ఇచ్చి జేబులు ఖాళీ చేసుకొని ఇంటి దారి పట్టే పరిస్థితులున్నాయంటే నమ్మక తప్పదు. చనిపోయిన కుటుంబాలు విషాదంలో ఉన్న పోస్టుమార్టం సిబ్బంది జేబులు తడపందే ఇక్కడ పని జరగదు. పేదరికంలో ఉన్నాం కష్టపడి దూరం నుంచి వచ్చాం కనికరించండి అని వేడుకున్నా పోస్టుమార్టం సిబ్బంది కనికరించడు కదా మాకేం తెలియదు డాక్టర్ వచ్చాకే పోస్టుమార్టం చేస్తామని కింది స్థాయి సిబ్బంది చెప్పడంతో బెంబేలెత్తుతున్న మృతుల కుటుంబ సభ్యులు డాక్టర్ వస్తే లంచం ఎక్కువ పోతుందేమోననే భయంతో జేబులో ఎంతుంటే అంత ముట్టచెప్పి ప్రాణం పోయినా పరిహారం చెల్లించక తప్పడం లేదంటూ దిగమింగి జేబుల్లో ఉన్నదంతా పోస్టుమార్టం సిబ్బందికీ ముట్టచెప్పి నిలువుగా కోసిన మృతదేహాన్ని కన్నీటి దక్కని కడుపులో దిగమింగి తీసుకెళుతున్న సంఘటనలూ నిత్యకృత్యమయ్యాయని పోస్టుమార్టం విభాగానికి వచ్చిన మృతుల బంధువుల ఆరోపించారు.
తమ బంధువు అనుకోకుండా పురుగుల మందు తాగి వైద్యం జరుగుతుండగానే మృతి చెందాడని నిర్ధారించిన డాక్టర్లు పోస్టు మార్టం నిమిత్తం ఇక్కడికి పంపిస్తే ఇక్కడ సిబ్బంది ఉదయం నుండి కాలయాపన చేస్తూ డాక్టర్ వస్తేనే పోస్టుమార్టం జరగుతుందని ఒకరి తరువాత ఇంకొకరు తమ వద్దకు వచ్చి డబ్బులు ఇస్తే త్వరగా పోస్టుమర్టం చేస్తామని బేరాలు ఆడుతున్నారని వారు ఆరోపించారు.దేవుడు కరుణించక కుటుంబ పెద్దను కోల్పోయిన బాధలో మేమంటే పోస్టుమార్టం కూడా మూడు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని తమది నిరుపేద కుటుంబం అని చెప్పినా కనికరించడం లేదని ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరగా పన్నెండు వందలు ఇస్తామని సిబ్బందికి చెప్పినా పట్టించుకోక పోవటంతో మీరు పోస్ట్ మార్టం చేసి ఎప్పుడిచ్చినా తీసుకెళ్తామని తమ వద్ద మాత్రం మూడు వేలు లేవని చెప్పామని పోస్టుమార్టం సిబ్బంది పెడుతున్న ఇబ్బందులుకు కన్నీరుమున్నీరుగా విలపించారు. సభ్య సమాజం సిగ్గుపడే సంఘటలకు ఎంజిఎంకు పోస్టుమార్టం విభాగం సిబ్బంది పాల్పడటం పట్ల డాక్టర్లే కాదు డాక్టర్ వృత్తి చేస్తున్న ప్రతి ఒక్కరూ తలదించుకునేలా ఉండటం సమాజానికి ఎంతైనా పెను ప్రమాదమే. అయితే పోయిన ప్రాణం తిరిగి రాదని నమ్మే కుటుంబాలకైనా తమ బంధువును కడసారి చూసుకోవాలనే తపనకు ఆర్ధికపరమైన అడ్డంకి ఏ కుటుంబానికి భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉండాల్సిన డాక్టర్లు ఇలాంటి పనులను చేయడంలో తీవ్ర బాధను వ్యక్తం చేస్తున్నారు బంధువులు. మొత్తానికి ఈ మార్చురీల చూస్తే అతి భయంకరమైన సినిమాలు తీసే దర్శకుల సైతం భయపడేలా ఉంది.