టీచర్లు వర్సెస్ పోలీసులు... 8 మంది టీచర్లు మృతి..
posted on Jun 20, 2016 @ 12:32PM
మెక్సికోలో ఒయాక్సాకా రాష్ట్రంలో ఉపాధ్యాయులు గత కొన్ని నెలలుగా ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారాయి. ఉపాధ్యాయులకు..పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..ఆందోళనలో భాగంగా ఉపాధ్యాయులు.. నిన్న ఒయాక్సాకా-ప్యూబ్లా రాష్ట్రాల మధ్య రహదారిని దిగ్బంధించేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీచర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో పోలీసులు ఫైరింగ్ జరపగా.. ఈ కాల్పుల్లో 8 మంది ఉపాధ్యాయులు ప్రాణాలుకోల్పోయారు.. పలువురికి గాయాలయ్యాయి. అంతేకాదు ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా విద్యావ్యవస్థలోని ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలని అక్కడ ఉన్న యూనియన్ సీఎన్ టీఈకి చెందిన కొందరు ఉపాధ్యాయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని అరెస్టు చేశారు. దీంతో సీఎన్ టీఈ యూనియన్ కు చెందిన టీచర్ సంఘాల వారంతా రోడ్లెక్కారు.