దుమారం రేపుతున్న సర్దార్ 'గన్ పెన్' మాల...
posted on Jun 20, 2016 @ 12:03PM
గుజరాత్ మాజీ పోలీసు అధికారి డీజి వంజార.. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి గన్ మాల వేయడం పెద్ద దుమారమే రేపుతోంది. గుజరాత్ లోని తన మద్దతుదారులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వంజార పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పటేల్ విగ్రహానికి పెన్నులు, గన్ తో ఉన్న మాలను వేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఓ నిజమైన జాతీయవాదిగా, పటేల్ ఎన్నో సంస్థానాలను దేశంలో విలీనం చేశారని.. ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసేందుకే తాను ఈపని చేశానని చెప్పుకొచ్చారు. అస్త్రశస్తాలతో ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారని కొనియాడారు. కాగా వంజార తాను సర్వీసులో ఉన్న సమయంలో ఎన్నో ఎన్ కౌంటర్లు చేసి వార్తల్లో నిలిచారు. అంతేకాదు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఇష్రాత్ జహాన్, సోహ్రాబుద్దీన్ ఫేక్ ఎన్ కౌంటర్లు నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన బెయిల్ పై ఉన్నారు. మరి ఈ గన్ పెన్ మాలపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి....