Read more!

మెగాస్టార్ రేంజ్.. 'గాడ్ ఫాదర్'కి 57 కోట్లు, 'మెగా 154'కి 50 కోట్లు!

జయాపజయాలతో సంబంధం లేకుండా చెక్కు చెదరని క్రేజ్ మెగాస్టార్ చిరంజీవి సొంతం. ఆయన గత చిత్రం 'ఆచార్య' ఘోర పరాజయం పాలైనప్పటికీ ఆయన తదుపరి సినిమాల బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఆయన సినిమాల డిజిటల్ రైట్స్ ను వరుసగా భారీ ధరలకు దక్కించుకుంటుంది.

 

అక్టోబర్ 5న థియేటర్స్ లో విడుదల కానున్న చిరంజీవి లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.57 కోట్లకు దక్కించుకున్నట్లు ఇటీవల న్యూస్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి తదుపరి చిత్రం 'వాల్తేరు వీరయ్య'(మెగా 154) డిజిటల్ రైట్స్ ని సైతం నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రికార్డు స్థాయిలో రూ.50 కోట్లకు ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

 

మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కి రీమేక్ గా మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న 'గాడ్ ఫాదర్'లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నాడు.  చిరంజీవి స్టార్‌డమ్‌ కి, సల్మాన్ స్పెషల్ రోల్ తోడవ్వడంతోనే తెలుగు, హిందీకి కలిపి రూ.57 కోట్లు చెల్లించడానికి నెట్ ఫ్లిక్స్ సిద్ధమైందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఒక రీమేక్ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్ ఆ స్థాయిలో అమ్ముడవ్వడం రికార్డు అనే చెప్పాలి. పైగా ఇప్పుడు 'మెగా 154'లో ఏ బాలీవుడ్ హంగులు లేకపోయినా రూ.50 కోట్లకు ఓటీటీ రైట్స్ అమ్ముడవ్వడం విశేషం.