Read more!

ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తున్న 'బింబిసార'!

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రం 'బింబిసార'. మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.

 

'బింబిసార'తో పాటు ఆగస్టు 5న థియేటర్స్ లో విడుదలైన 'సీతా రామం' సినిమా ఇప్పటికే ఓటీటీలో విడుదలై అలరిస్తుండగా.. ఎనిమిది వారాలు కావొస్తున్నా ఇంతవరకు 'బింబిసార' ఓటీటీలోకి రాకపోవడంతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే 'బింబిసార' ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. అక్టోబర్ 7 నుంచి 'జీ5'లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఇదిలా ఉంటే మరో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'కార్తికేయ-2' సైతం దసరా కానుకగా అక్టోబర్ 5 నుంచి 'జీ5'లో స్ట్రీమింగ్ కానుందని న్యూస్ వినిపిస్తోంది. ఈ రెండు చిత్రాల ఓటీటీ స్ట్రీమింగ్ గురించి జీ5 నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ నిర్మించిన 'బింబిసార'లో కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్, ప్రకాష్ రాజ్, వివన్ భాటేన, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి, చిరంతన్ భట్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా ఛోటా కె. నాయుడు, ఎడిటర్ గా తమ్మిరాజు వ్యవహరించారు.