మసూద్ అజర్ విషయంలో భారత్ కు చైనా అడ్డుకట్ట...
posted on Oct 10, 2016 @ 4:15PM
ఒకపక్క ఎన్ఎస్జీ సభ్యత్వం విషయంలో భారత్ కు మద్దతుగా ఉంటామంటూనే.. మరోపక్క ఉగ్రవాదం విషయంలో మాత్రం పాక్ ను వెనకేసుకొస్తుంది. జైషే మొహ్మద్ ఉగ్రవాది మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి, అతనిపై నిషేధం విధించాలని ఎప్పటినుండో భారత్ ఎప్పటినుండో చూస్తుంటే..ఇప్పుడు చైనా దానికి కూడా అడ్డుకట్ట వేసింది. పీవోకేలో చేసిన సర్జికల్ దాడులు చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్ట్‌పై తీవ్ర ప్రభావం చూపడంతో.. ఇవన్నీ మనసులో పెట్టుకున్న చైనా అంతర్జాతీయ సమాజంలో పబ్లిగ్గా పాకిస్థాన్, ఆ దేశ ప్రేరేపిత ఉగ్రవాదానికి మద్దతిస్తోంది. కౌంటర్ టెర్రరిజం పేరుతో భారత్ రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటోందని.. నీతులు చెబుతోంది. అంతేకాదు.. మసూద్ అజర్ పై నిషేధం విధించాలన్న ప్రతిపాదనను సాంకేతిక కారణాలు చూపుతూ మరో మూడు నెలల పాటు నిలిపేసింది చైనా.