మత్తు కలిగించే దగ్గు మందు బాటిళ్లు పట్టివేత
posted on Aug 28, 2025 @ 6:02PM
గంజాయి, డ్రగ్స్ లభించక పోవడంతో డ్రగ్స్ మత్తుకు అలవాటు పడిన వ్యక్తులు నిషేధిత దగ్గు మందు టానిక్‌లను తాగి మత్తులో మునిగిపోతున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి ఎన్‌ఫొర్స్‌మెంట్ సీఐ బాలరాజు, ఎస్సై రవి, సిబ్బంది కలిసి పక్కా సమాచారంతో సరూర్‌నగర్ కొత్తపేట ప్రాంతానికి చెందిన మూసం లక్ష్మణ్ అనే వ్యక్తిని రోడ్ నెంబరు 6 అష్టలక్ష్మీ టెంపుల్ మందమల్లమ్మ చౌరస్తా నుంచి 102 కోడిన్ పాస్పెట్ దగ్గుమందు బాటిళ్లను కొనుగోలు తీసుకొని బైక్‌పై వెళ్తుండగా పట్టుకున్నారు.
రూ.190 ఎంఆర్‌పీ ధర కలిగిన ఈ దగ్గు మందు బాటిల్స్‌ను లక్ష్మాణ్ తన ఇంట్లో పెట్టుకొని రూ. 350 ఒక బాటిల్‌ను అమ్మకాలు చేపడుతున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. కోడిన్ పాస్పెట్ బాటిళ్లను డ్రగ్స్ ఆధారిటీ గతంలో నిషేధించారు. దగ్గు మందును డాక్టర్ చీటితో మాత్రమే అమ్మకాలు జరపాలి. కాని కొందరు అక్రమంగా దగ్గు మందును తయారు చేస్తూ ఎవ్వరికి అనుమానం రాకుండా అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్‌లో మత్తు కలిగించే గంజాయి ప్యాకెట్ ధర రూ. 500 ఉంది. ఒక గ్రాము ఎండిఎంఎ డ్రగ్ విలువ రూ. 5000 వేలు ఉంది.
అంత డబ్బుతో కొనుగోలు చేయలేని వారు, మత్తుకు బానిసగా మారిన వారు ఇలా మార్కెట్ అక్రమంగా అమ్మకాలు జరుపుతున్న దగ్గు మందును వాడి మత్తులో మునిగి పోతున్నారు.ఇలాంటి నిషేధిత మత్తు మందులను అమ్మకాలు జరుపుతున్న మెడికల్ హల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్‌ఫొ ర్స్‌మెంట్ సీఐ బాలరాజు డ్రగ్స్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు.ఇలాంటి నిషేదిత కోడిన్ పాస్పెట్ మందును పట్టుకున్న సిఐ, సిబ్బందిని అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్, ఏఈఎస్ జీవన్ కిరణ్ అభినందించారు.