మాట తడబడిన రక్షణమంత్రి పారికర్..
posted on Jun 18, 2016 @ 6:37PM
రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలంగాణ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న పారికర్ పొరపాటున మాట తడబడ్డారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ నియామకం అయినా సంగతి తెలిసిందే. అయితే.. పారికర్ మాత్రం అది మర్చిపోయినట్టున్నారు.. పొరపాటున కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆయన సంబోధించారు. దీంతో వేదికపై ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు ఇతర నేతలు కూడా ఖంగుతిన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీపైన విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీలో పార్టీ ఫిరాయింపులు యథేచ్ఛగా సాగుతున్నాయని.., ఇప్పుడు ఆ పార్టీలో చేరినవాళ్లంతా చివరి ఏడాదిలో మళ్లీ తిరుగుముఖం పట్టడం ఖాయమని పారికర్ చెప్పారు. తెలంగాణలో వాస్తుపాలన సాగుతోందని.. ఇక్కడ బీజేపీ ఎదిగేందుకు చాలా అవకాశం ఉందని.. మోదీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పారికర్ అన్నారు.