సర్జికల్ దాడులు వంద శాతం కచ్చితమైనవే...
posted on Oct 6, 2016 @ 3:56PM
భారత్-పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి చేసిన సర్జికల్ దాడులపై ఇప్పటికీ పలు అనుమానాలు తలెత్తున్న సంగతి తెలిసిందే. అసలు భారత్ ఈ దాడులు చేసిందా అని కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనిపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పందిస్తూ.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులు వంద శాతం కచ్చితమైనవని.. పెద్ద పెద్ద దేశాలు కూడా సర్జికల్ దాడులు చేస్తాయని, అయితే అవి కూడా ఇంత విజయవంతం కాలేదని ఆయన స్పష్టంచేశారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేసినంత మాత్రాన దాడులకు సంబంధించిన సాక్ష్యాలను విడుదల చేయాల్సిన అవసరం లేదని.. దేశ రక్షణ విషయానికి వస్తే తాను కుతంత్రాలు పన్నడానికి కూడా సిద్ధమేనిని పారికర్ చెప్పడం గమనార్హం. కొంతమంది తనను ముక్కుసూటి మనిషి అని అంటారని, అయితే దేశ రక్షణ విషయానికి వస్తే మాత్రం రక్షణ మంత్రి సూటిగా ఉండాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు.