పాక్, చైనాకు ధీటుగా.. యుద్ధ విమానాల ఒప్పందం..
posted on Sep 24, 2016 @ 4:28PM
భారత్ కు పాకిస్థాన్, చైనా దేశాలు పక్కలో బల్లెంలా తయారైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెండు దేశాలను ధీటుగా ఎదుర్కోనేందుకు భారత్ సిద్దమైంది. ఫ్రాన్స్, భారత్ ల మధ్య గత కొన్నేళ్లుగా యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పుడు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రపంచంలోనే అత్యాధునిక 36 రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసింది. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ ఫ్రాన్స్ రక్షణ మంత్రి జీన్ వ్యేస్ లే డ్రియాన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మొత్తం రూ.59 వేల కోట్ల రూపాయలతో జరిగిన ఈ ఒప్పందలో ముందుగా భారత్ 15 శాతం మొత్తాన్ని ఫ్రాన్స్ కు చెల్లించనుంది. తుది ఒప్పందం జరిగిన తేది నుంచి 18 నెలల లోపు పూర్తిగా రాఫెల్ యుద్ధవిమానాలు భారత్‌కు అందనున్నాయి. 2019 నాటికి మొదటి రాఫెల్ విమానం భారత్ చేరుకోనున్నట్లు సమాచారం. కాగా రాఫెల్ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా సునాయసనంగా చేధించగలదు.