పాకిస్థాన్ కు యూరోపియన్ యూనియన్ వార్నింగ్..
posted on Sep 24, 2016 @ 3:52PM
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు పలు దేశాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక సార్లు పాకిస్థాన్ కు వార్నింగ్ లు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ జాబితాలో యూరోపియన్ యూనియన్ కూడా చేరిపోయింది. బలోచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను నిలిపివేయకుంటే పాక్‌పై ఆంక్షలు విధించిననున్నట్లు యురోపియన్ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు రిజర్డ్ జర్నెకి తెలిపారు. జెనీవాలో పాక్ ఊతకోత చర్యల వల్ల ప్రాణాలు కోల్పోయిన బలోచిస్తాన్ స్వతంత్ర సమరయోధులకు ఆయన నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో ఆర్థిక, రాజకీయ ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని, ఒక వేళ ఆ దేశం బలోచిస్తాన్ అంశంలో తన విధానాన్ని మార్చుకోకుంటే, అప్పుడు పాక్ పట్ల తమ విధానాన్ని మార్చుకుంటామని ఆయన హెచ్చరించారు. బలూచీలో జరుగుతున్న మరణాలకు కారణమైన పాక్ సైనిక అధికారులను అంతర్జాతీయ కోర్టు ముందు దోషులగా చేసి ఉరి తీయాలని.. బలోచిస్తాన్‌లో పాక్ చేస్తున్న అకృత్యాలను ప్రపంచం తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని బుగ్తి అన్నారు.