మామిడి కాయల దొంగలు అరెస్ట్..
posted on Apr 27, 2021 @ 10:48AM
కోడి కత్తికి వ్యక్తి మృతి. ఎదురుగా ఉన్న ఇంట్లో పాల పాకెట్ దొంగతనం. షావుకారి షాప్ లో బెల్లం దొంగతనం. అని అప్పుడప్పుడు ఇలాంటి వింత వార్తలు వింటుంటాం. ఇప్పుడు మీరు చదివే వార్త కూడా వింత వార్తనే.. కానీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది.
దొంగతనం అందరు చేస్తారు. కొందరి దొంగతనం వృత్తి. మరి కొందరికి అదే దొంగతనం అవసరం. ఇంకొందరికి అదే దొంగతనం అలవాటు. దొంగతనం అంటే అందరికి గుర్తుకు వచ్చేది. ఏ బంగారమే. డబ్బులు దొంగతనం చేయడమో అనుకుంటారు. కొంత మంది దొంగతనం చేస్తారు. కానీ కొందరు చాలా ఈజీ గా దొరికిపోతారు.. మరి కొందరు అయితే చాలా ముదుర్లు చిక్కారు దొరకరు. ఒక్కోసారి చేసింది చిన్న దొంగతనం అయినా, ఆ దొంగ దొరికితే, ఆ దొంగతనం వల్ల పెద్ద శిక్షలే పడుతాయి. నేరం ఏదైనా చివరికి శిక్ష తప్పదు. వీళ్ళు కూడా దొంగతనం చేశారు. దొంగ తనం అంటే అలాంటిలాంటి దొంగతనం కాదు.. మామిడి కాయలు దొంగతనం చేశారు. అందుకు వారు భారీ మూల్యం చెల్లించుకున్నారు..
పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు దొంగలు పారిపోయేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వెంబడించి పట్టుకోగా.. చివరకు మామిడికాయ దొంగలు అని తేలింది. పూర్తి వివరాళ్లోకి వెళితే.. జగిత్యాల మండలం మోరపెల్లి గ్రామ శివారులోని మొర్రి విజయ్ అనే రైతు తన మామిడి తోటలో గుర్తుతెలియని వ్యక్తులు మామిడి కాయలు దొంగిలించారని ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు చల్‌గల్ గ్రామ ఎక్స్ రోడ్ వద్ద రూరల్ పోలీసులు వాహనాల సోదాలు చేపట్టారు. ఇదే సమయంలో ఒక ప్యాసింజర్ ఆటోలో మామిడికాయలతో నలుగురు వ్యక్తులు వస్తూ పోలీసులను చూసి ఇద్దరు పారిపోగా.. మిగిలిన ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరిని విచారించగా మామిడి కాయలను దొంగతనం చేశామని ఒప్పుకోవడంతో వారి నుండి రెండు క్వింటాళ్ల మామిడి కాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసి ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.