3 గంటల్లో శ్రీవారి దర్శనమా..
posted on Aug 3, 2025 @ 10:36AM
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ విధానం ద్వారా రెండు మూడు గంటల్లో స్వామివారిని దర్శించుకోవడం అసంభవంమని తెలిపారు. ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం..ఇవాళ ఉదయం వీఐపి విరామ సమయంలో తిరుమల ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత పెంచాలని టీటీడీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు.
భక్తులకు శ్రీవారి దర్శనాన్ని రెండు మూడు గంటల్లో చేయించడం అసంభవం అని ఆయన కొట్టిపడేశారు.. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉపయోగించిన త్వరితగతిన స్వామివారి దర్శన భాగ్యం కల్పించడం కష్టతరమని స్పష్టం చేశారు... ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ విధానానికి స్వస్తి పలికి సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టిటిడి కి సూచించారు