బంగాళాఖాతంలో అల్పపీడనం... ఎపికి పొంచి ఉన్న ముప్పు

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.  ఎపికి మరో మారు తుఫాను ముప్పు పొంచి ఉంది.  నవంబర్ 25న (సోమవారం) వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను ఎపి నుంచి  తమిళనాడు అక్కడి నుంచి శ్రీలంక తీరాలవైపు కదొలొచ్చని  విపత్తు నిర్వహణ సంస్థ  ఎండీ కూర్మనాథ్‌ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 27, 28, 29న భారీ వర్షాలు కురుస్తాయని  విపత్తు నిర్వహణ సంస్థ  హెచ్చరిక జారీచేసింది. మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.  35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో వచ్చే నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణం శాఖ హెచ్చరించింది.