విడాకుల పార్టీలో ప్రేమ వ్యవహారం!
posted on Aug 22, 2022 @ 10:50PM
ప్రేమ గురించి ఇప్పటికే తెలుగు సినిమాలు అనేక నిర్వచనాలతో మనసుల్లో గట్టి ముద్రనే వేశాయి. పూర్వం చెట్టూపుట్టా తిరుగుతూ పాడుకునే హీరో హీరోయిన్లు, కాలక్రమంలో క్లాస్‌రూమ్‌ల్లో ప్రేమించే సుకుంటున్నారు. ఇప్పుడు ఇంకాస్త అందంగా వేరే వాళ్ల పెళ్లిళ్లలో ప్రేమను వెతుక్కుంటున్నారు. ఒక్క రిద్దరు సక్సస్ అవుతున్నారు. అయితే మెల్‌బోర్న్‌కి అమ్మాయి గాబ్రిలా లాం డాల్ఫీ మాత్రం వేరే విధంగా ప్రేమలో పడింది. ఇది సినిమాకి తక్కువేమీ కాదు. గాబ్రిలా విడాకుల కార్యక్రమంలో మరో వ్యక్తితో ప్రేమ లో పడింది! ఇంతకంటే ట్విస్ట్ మరోటి ఉంటుందా?
ఎవరన్నా పెళ్లయి, అనేకానేక కారణాల వల్ల విడి పోతే ఎంతో బాధపడుతూంటారు. జీవితం ఎలాగా అని తెగ ఆలోచనలో పడి కాలం వెళ్లదీస్తుంటారు. కానీ గాబ్రిలా సంగతి వేరు. ఆమె మొదటి భర్తకు విడాకులు ఇవ్వడం కూడా పెద్ద పార్టీలా చేసింది. ఆ పార్టీకి అన్ని ఏర్పాట్లు చూడ్డానికి వచ్చిన వైయిటర్లలో ఒకడు జాన్ లాండాల్ఫీ. అతను ఆమెను చూడగానే ఢభాల్న ప్రేమలో పడిపోలేదు, అమాంతం నువ్వు అదీ, నేను ఇదీ.. అంటూ పాటేమీ అందుకోలేదు. ఆమెకు కోపం తెప్పించే మాటే అనేశాడు. మేడమ్ మీరు వేసుకున్న డ్రస్ నిజానికి మీకు సూట్ కాలేదు. అది మీ లోపం కాదు, మీకు సూట్ కాలేదంతే.. అనేశాడు. ఆమెకు అప్పటిదాకా ఉన్న ఆనందం కాస్తా పోయి కోపంతో ఊగి పోయింది. పరుగులాంటి నడకతో బెడ్‌రూమ్‌కి వెళ్లి తనని నిలువెత్తు అద్దంలో చూసుకుంది. తాను, తన మేకప్ అంతా బాగానే ఉంది. కానీ డ్రస్ కలర్ ఆమెకు సరిపడలేదు. అరగంట తర్వాత శాంతించి ప్రశాంతంగా బయటికి వచ్చింది. అదే డ్రస్‌లో అందరినీ పలకరిస్తూ తిరిగింది.
కొంతసేపటికి మళ్లీ అతగాడు ఎదరయి చాలా ఆరాధనా భావంతో చూసి ఆమెకు మంచి డ్రింక్ ఇచ్చాడు. మీలాంటి మంచి మనసు ఉన్నవారికి కోపం సూట్ అవదు అనేశాడు. అరే వీడెలా పసిగట్టాడు అనుకుంది. మీరు వేగంగా మెట్లు ఎక్కి వెళుతుంటే గమనించాను. ఐ యామ్ సారీ.. నాదే తప్పు అని మరో మంచి డ్రింక్ ఇచ్చాడు. వీడిలో ఏదో పవర్ ఉంది.. అనుకుంది. అతని సిన్సియారిటీ ఆమెకు బాగా నచ్చింది. తన భర్తతో విడాకుల పార్టీ అయిపోయింది. ఆ తర్వాత రోజు ఆ వెయిటర్‌నే పిలిచి ఇంట్లో చాలాసేపు మాట్లాడి మనం ఇక నుంచి స్నేహితులం అంటూ చేయి అందించింది. అతను చక్కగా నవ్వాడు. వారు ప్రేమలో పడ్డా రు. అలాగని అతను తరచూ వెళ్లేవాడు కాదు. ఆమె రమ్మంటేనే వెళ్లేవాడు. అతని వ్యక్తిత్వం, హుందాతనం నచ్చాయి. ఒక రోజు హఠాత్తుగా మనం పెళ్లి చేసుకుందామా అని అడిగింది. అతని నిర్ఘాంతపోయాడు. అప్పటికి వారి స్నేహం, ప్రేమ వయసు కేవలం పది నెలలే! ఒకరోజంతా ఆలోచించి అతను సరే అనేశాడు.
విడాకుల పార్టీ జరిగిన హోటల్లోనే గాబ్రిలా, లాండోల్ఫీని పెళ్లాడింది. దీన్ని గురించి చాలా రోజులు కథలు కథలుగా చెప్పుకున్నా రు మెల్‌బోర్న్‌లో. పెళ్లిళ్లు ఇలా కూడా అవుతాయా పిన్నీ.. అన్నది పక్కింటి జూలీ. ఇపుడు గాబ్రిలా, జాన్ లకు ఓ పిల్లాడు కూడా!