లోకీ..ఐ లవ్ యూ!
posted on Sep 16, 2022 @ 5:36PM
చాలామందికి చిరంజీవంటే యిష్టం. కొందరికి అర్జున్ అంటే యిష్టం, మరికొందరికి ప్రబాస్ అంటే మరీ యిష్టం. ఓ చిన్నారికి లోకీ అంటే మహాయిష్టం! చూసే సినిమాలు, చదివే కథలు వాటిల్లో పాత్రలు, పోనీ నటులు ఆటోమాటిక్‌గా ఆకట్టేసుకుంటారు. అలానే మాట్లాడాలని, సరదాలు చేయాలని అభిమానులు ప్రయత్నిస్తుంటారు. కలవాలని, నాలుగు మాటలు, ఓ సెల్ఫీకోసం తెగ ఆరాటపడుతుంటారు. కానీ ఈ పాప మాత్రం మార్వల్ అనే వెబ్ సిరీస్‌లోని లోకి ఏకంగా ఐ లవ్ యూ అంటూ ఉత్తరం రాసింది!
ఇప్పటి పిల్లలు వీడియోగేమ్‌లు, వెబ్ సిరీస్‌లంటే చెవి కోసుకంటున్నారు, కళ్లప్పగించేస్తున్నారు. గడి యారంలో ముల్లు తిరగడానికి వీరి కాలక్షేపానికి సంబంధం ఉండదు. అమ్మ గిన్నెలో అన్నం పెట్టు కుని వారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటుంది. ఈ పాపలాంటి వారు మాత్రం వాళ్ల సూపర్‌హీరోతో అలా తిరుగు తూంటారు!
వీరహనుమాన్, స్పైడర్‌మాన్, లోకీ వంటి పాత్రలు పిల్లల మనసులో ముద్రవేసుకున్నాయి. డిస్నీ సిరీస్ ల్లో టామ్ అండ్ జెర్రీ అనగానే టీవీకి అతుక్కుపోతుంటారు. పిల్లీ ఎలుక చెలగాటమే అన్ని ఎపిసోడ్లు. కానీ వాటిలో ఎంతో ట్విస్టులు, సరదాలూ ఉంటాయి. స్పైడర్‌మాన్ ఫలానా పట్టణంలో మేడ నుంచి పడి పోతున్న వ్యక్తిని ఎలా కాపాడో తెలుసుకోవాలి, హనుమాన్ అంత వేగంగా ఎలా వెళుతున్నదీ చూడాలి.. అంతా వింతే.. అంతా హృద్యమే. పిల్లలకు అన్నీ మహాద్భుతాలే! వాటినే చూడాలని మరీ మరీ కోరు కుంటారు.
అమెరికా టెలివిజన్ ప్రేక్షకులను అలరించేందుకు మైకేల్ వాల్డ్రన్ రూపొందించిన సిరీస్ మార్వెల్ కామిక్స్. దానిలోని పాత్ర లోకీ. అది అక్కడి పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పాపని కూడా. అందు కనే ఈ పాప ఒక కాయితం మీద ఐ లవ్ యూ అని రాయడమే కాకుండా కష్టపడి ఆ పాత్ర బొమ్మ కూడా వేసింది. వేళ్లు నొప్పులు పుట్టే ఉంటాయి.. కానీ అదో ఆనందం! మరి బోల్డు ప్రేమతో రాసిన ఉత్తరాన్ని ఎవరన్నా లోకీ పాత్రధారికి అందించారా లేదా అన్నదే తెలియలేదు. చేరవేస్తే అందరం సంతోషిం చొచ్చు.. ఈ పాపతో పాటు!