ఈ ఇంట్లోనే 104 ఏళ్ల గా ఉంటున్నా..ఆల్కాక్
posted on Jul 16, 2022 @ 5:10PM
గ్రామాల్లో అమ్మమ్మలు, తాతయ్యల ఇళ్లు ఇపుడు లేవు. ఇపుడంతా అపార్ట్‌మెంట్ కల్చర్ వచ్చేసింది. పట్టణానికి, గ్రామానికి పెద్దగా తేడా తెలియడం లేదు. కానీ ఇప్పటికీ చాలా పాత ఇంట్లో నివాసం వుంటోంది ఎలిసీ ఆల్కాక్. బ్రిటన్ నుంచి అమెరికా వచ్చి వుంటున్న ఆల్కాక్ 1918లో జన్మించింది. హత్‌వైట్ లోని బార్కర్ స్ట్రీట్‌లో ఆమె తండ్రి 1902లో ఒక ఇల్లు ఏడు షిల్లింగుల,ఆరు పెన్స్‌కి కొన్నాడట. అంటే ఇప్పటి లెక్కల్లో ఆ యిల్లు సుమారు 2,800 డాలర్లట! ఆల్కాక్ రెండు ప్రపంచయుద్ధాలు, నలుగు రాజులు, రాణు లు, 25 మంది ప్రధానుల కాలం గడచిపోవడానికి సాక్షిగా వున్నది.
ఆల్కాక్ ఐదుగురు సంతానంలో చివరిది. 1941లో అంటే రెండవ ప్రపంచయుద్ధం కాలంలో బిల్ అనే వ్యక్తిని వివాహంచేసుకుని ఇక్కడే వుంటోంది. ఆల్కాక్ 14వ ఏట ఆమె తల్లి న్యుమోనియాతో మరణిం చారు. అప్పటి నుంచి తండ్రితోనే వుంటున్నారు. 1949లో ఆమె తండ్రి కూడా మరణించిన తర్వాత ఈ ఇంటిని తాను తండ్రి ఇచ్చిన ఆస్తిగా తీసుకున్నారు. ఆ తర్వాత క్రమేపీ ఇంటిని కొద్దిపాటి మార్పులు చేస్తూ బాల్య జ్క్షాపకాలతో ఇంకా ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు ఆల్కాక్. ఇంటితో వుండే అనుబుంధం అలానే వుంటుంది. అందుకే అంటారు.. పుట్టినింటి నుంచి దూరంగా వెళ్లవచ్చునేమోగాని.. ఆ ఇంటిని మనసు లోంచి దూరం చేసుకోలేమని. నిజమే కదూ!