లింకులు బయటపడుతున్నాయి!
posted on Nov 14, 2022 @ 10:23PM
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డికి వైసీపీ అగ్రనాయకత్వంతో అనుబంధం చిన్నదేమీ కాదు. శరత్ చంద్రారెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయితో చుట్టరికం ఉందని మాత్రమే ఇంత కాలం అనుకుంటూ వచ్చాం. కానీ విజయసాయితో చుట్టరికానికి ముందే ఆయనకు వైఎస్ జగన్ తో అనుబంధం ఉంది. ఎలా అంటే జగన్ అక్రమాస్తుల కేసులో శరత్ చంద్రారెడ్డి కూడా సహ నిందితుడు. ఆ అనుబంధంతోనే శరత్ చంద్రారెడ్డికి జగన్ ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి దక్కేలా చేశారు.
ఔను పీనపాక శరత్ చంద్రరెడ్డి ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు. జగన్ తో అసోసియేషన్ కారణంగానే ఆయనా పదవి దక్కిందన్న విమర్శలు ఉన్నాయి. వీరిరువురి మధ్యా అసోసియేషన్ జగన్ అక్రమాస్తుల కేసులో శరత్ చంద్రారెడ్డి కూడా ఒక నిందితుడు అవ్వడంతోనే అర్ధమౌతుంది. ఆయనే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఏపీలో అరబిందో ఎన్నో ప్రాజెక్టులు దక్కించుకుంది.
అంబులెన్స్ కాంట్రాక్ట్ కూడా అరబిందోకే దక్కింది. అలాగే అధికార బలం అండతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌నూ అద్యక్షపదవీ దక్కివంది. తన అల్లుడి సోదరుడు అయిన శరత్ చంద్రారెడ్డి జగన్ అధికారం చేపట్టిన అనతి కాలంలోనే ఏసీఏ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన అధ్యక్షుడయ్యాకే ఏసీఏ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో ఆ కుంభకోణానికి ఏపీతో లింకులు ప్రస్ఫుటమయ్యాయి. ఈ స్కామ్ కు సంబంధించి ఈడీ అరెస్టు చేసింది. అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డిని, వినయ్ కుమార్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిరువురినీ ఢిల్లీలో రెండు రోజుల పాటు విచారించి ఆ తరువాత అరెస్టు చేసినట్లు ప్రకటించింది.
అరబిందో శరత్ చంద్రారెడ్డి, వినయ్ కుమార్ లకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారాలతో సంబంధాలున్నాయని ఈడీ పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు కావడంతో ఆ సెగ తాడేపల్లి ప్యాలస్ కు తగిలింది. దీంతో సకల శాఖల మంత్రి సజ్జల రంగంలోకి దిగి శరత్ చంద్రారెడ్డి విజయసాయి అల్లుడు కాదనీ, ఆయన సోదరుడనీ చెబుతూ.. సోదరుడి అక్రమాలతో విజయసాయి అల్లుడికి ఏం సంబంధం అని మీడియా ముఖంగా చెప్పారు. అయితే ఏ సంబంధం, అనుబంధం లేకుండానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పదవిని శరత్ చంద్రారెడ్డికి కట్టబెట్టారా? ఏ సంబంధం లేకుండానే జగన్ అక్రమాస్తుల కేసులో ఏ1, ఎ2తలో పాటు శరత్ చంద్రారెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. లిక్కర్ స్కాం దర్యాపులో ఈ లింకులు ఎంత వరకూ ఉన్నాయో బహిర్గతమయ్యే అవకాశం ఉంి.