సూపర్ స్టార్ కృష్ణకు కన్నీటి వీడ్కోలు
posted on Nov 16, 2022 @ 3:57PM
మహాప్రస్థానంలో సూపర్‌స్టార్ కృష్ణ అంతిమ సంస్కారాలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. అంతకు ముందు బుధవారం ఉదయం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కృష్ణ అభిమానులు పద్మాలయ స్టూడియోకు చేరుకుని తమ అభిమాన నటుడి పార్థివదేహం వద్ద నివాళులర్పించి వద్ద పుష్పాంజలి ఘటించారు. అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య పద్మాలయ స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకూ కృష్ణ అంతిమయాత్ర సాగింది.
తమ అభిమాన హీరోని కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చి అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. సూపర్‌స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి విదితమే. కు పోటెత్తారు. పద్మాలయా స్టూడియోస్‌లో కృష్ణ పార్థివదేహానికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్ బ్యాండ్ మధ్య అంతమ యాత్ర కొనసాగింది. పోలీసులు మహాప్రస్థానంలోకి అందరినీ అనుమతించలేదు.
సన్నిహితులను మాత్రమే లోపలకు పంపి, ఇతరులందరినీ బయటే ఆపేశారు. మహాప్రస్థానం కు చేరుకున్న తర్వాత కృష్ణ పాడెను ఆయన చిన్ననాటి మిత్రుడు, సినీ నటుడు మురళీమోహన్, టీడీపీ నేత బుద్దా వెంకన్న మోశారు. కృష్ణ కుమారుడు హీరో మహేష్ బాబు కృష్ణ చితికి నిప్పంటించారు.