ఫైనల్ రిహార్సల్‌లా సూపర్ 4.. పాక్‌పై లంక 5 వికెట్లతేడాతో విజయం
posted on Sep 10, 2022 6:31AM
పథుమ్ నిస్సాంక 55 పరుగులతో అజేయంగా రాణించడంతో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన చివరి సూపర్ 4 ఆసియా కప్ మ్యాచ్‌లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. అతనికి తోడు భానుక రాజపక్సే 24 పరు గులు చేయగా, దసున్ షనక 21 పరుగులు చేశాడు. మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే శ్రీలంక విజయభేరి మోగించడంతో వనిందు హసరంగా చివరగా ఒక ఫోర్ కొట్టి జట్టు విజయం ఖరారు చేశాడు.
ఆసియాకప్ సూపర్ 4 చివరి మ్యాచ్‌లో శుక్రవారం శ్రీలంక 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై గెలిచింది. ఆట మొత్తం ఫైనల్‌కి రిహార్సిల్ లాగానే అనిపించింది. రెండు జట్లు అంత సీరియస్‌గా ఆడుతున్నట్లు కనపడలేదు. కానీ శ్రీలంక మాత్రం ఈ టోర్నీలో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్లో పాక్‌కు గట్టి పోటీనిచ్చేస్థాయిలో ఉంది.
ఆదివారం జరిగే ఫైనల్లో ఈ జట్లమధ్య హోరా హోరీ పోరునే క్రికెట్ వీరాభిమానులు ఆశిస్తున్నారు. లంక జట్టు తమ అల్‌రౌండ్ ప్రతిభతో తప్పకుండా పాకిస్థాన్‌కు అంత సులు వుగా ఫైనల్ సాగనిచ్చేట్టు లేదన్నది శుక్రవారం మ్యాచ్ లో పాక్ జట్టును అడ్డుకున్న తీరు తెలియజేసింది. లంకే కదా అనుకు న్న పాక్ కు లంక బౌలర్లు బెదరగొట్టేరు. 19.1 ఓవర్లలో 121 పరుగులకే పాక్ కుప్పకూలి ఆశ్చర్యపరిచింది. కొంత ఫైనల్ చేరామ న్న ధీమాతో ఆడినప్పటికీ అజామ్ సేన చాలా పేలవంగా ఆడింది. ఓపెనర్ నిస్సాంక (55) అజేయ అర్ధసెంచరీ సాధించగా, రాజ పక్స (24), షనక (21) ఆకట్టుకున్నారు. రౌఫ్, హస్నైన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా హసరంగ నిలి చాడు.