నోబుల్ గ్రహీత అమర్త్యసేన్ పై భూ కబ్జా ఆరోపణ
posted on Apr 21, 2023 @ 10:24AM
విశ్వ భారతి యూనివర్శిటీ నోబుల్ గ్రహీత అమర్త్యసేన్ కు ఇచ్చిన కబ్జా ఆరోపణలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. 13 దశాంశాల భూమిని సైతం ఖాళీ చేయాలని యూనివర్శిటీ నోటీసులు జారీ చేయడం నోబుల్ గ్రహీతను అవమానపర్చడమేనని విశ్లేషకులు అంటున్నారు.
అమర్త్యాసేన్ ఒక కబ్దాదారు అన్న లెవల్ లో కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం చూస్తే బీజేపీ ప్రభుత్వం అమర్త్యా సేన్ ను టార్గెట్ పెట్టుకున్నట్టు కనబడుతోంది. వాయువ్య మూలలో ఉన్న 13దశాంశాల భూమిని సైతం వదులుకోవడానికి సిద్దంగా లేదు. పైగా రూల్స్ మాట్లాడుతోంది. చట్టవిరుద్దంగా భూమిని అమర్త్యాసేన్ ఆక్రమించాడని బీజేపీ ప్రభుత్వ ఆరోపణ. అమర్త్యాసేన్ వంటి దిగ్గజానికి భూమిని ఆక్రమించాల్సిన అగత్యం ఏమిటి? ఉద్దేశ్యపూర్వకంగా 13 దశాంశాల భూమిని ఆక్రమించాడా? ప్రభుత్వమే అమర్త్య సేన్ ను టార్గెట్ చేసి కబ్జా ఆరోపణలు చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ‘‘ ప్రధానమంత్రి తనను విమర్శించే ఎవరినైనా టార్గెట్ చేస్తాడని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి చేతుల మీద భారత రత్న అవార్డు అందుకున్న అమర్థ్య సేన్ ను టార్గెట్ చేయడం శోచనీయం’’ అని ఆయన ట్వీట్ చేశారు.
అమర్త్యసేన్ గొప్ప ఆర్థికవేత్త. 1998లో నోబుల్ పురస్కారం దక్కింది. పేదరిక నిర్మూలనకు ఆయన పాటుపడ్డారు.
వివాదాస్పదమైన ఈ భూమిని తన తండ్రి కొనుగోలు లీజుకు తీసుకున్నాడని, ఇందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని అమర్త్య సేన్ చెబుతున్నారు. పేదల అభ్యున్నతికి ఆయన అనేక ఆర్థిక విధానాలను రూపొందించాడు. 99 సంవత్సరాల కోసం అమర్త్యసేన్ తండ్రి విశ్వ భారతి విశ్వ విద్యాలయానికి చెందిన 1.25 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాడని వైస్ చాన్సలర్ చెబుతున్నారు. 15 రోజుల్లో వివాదాస్పద 13 దశాంశాల భూమిని వెనక్కి తీసుకుంటామని వైస్ చాన్సలర్ అంటున్నారు. అమర్థ్య సేన్ ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. ఆయన 1933లో జన్మించారు. 89 సంవత్సరాల వయసులో కూడా అమర్థ్యా సేన్ కబ్జా ఆరోపణలు ఎదుర్కోవడం పలువురిని విస్మయపరుస్తుంది. అమర్త్యా సేన్ తండ్రి అశుతోష్ సేన్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పని చేశాడు. అతను ధాకా యూనివర్శిటీలో పని చేశాడు. అమర్థ్యా సేన్ కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజిలో చదువుకున్నారు. తర్వాత హార్వార్డ్ యూని వర్శిటీలో చదువుకున్నారు.