త్వరలో మోపిదేవి, నిమ్మగడ్డలకు బెయిల్ ?
posted on Aug 4, 2012 @ 10:28AM
గత సంవత్సరం నవంబరు 3న కోనేరు ప్రసాద్‌తో జగన్ అక్రమాస్తులకు సంబందించిన అరెస్టులు ప్రారంభం అయ్యాయి. ఎమ్మార్ ప్రోపర్టీస్‌కు సంబందించిన కేసులో స్టయిలిష్ హోమ్ రియల్ ఎస్టేట్ ప్రయివేట్ లిమిటెడ్‌లో ప్రమోటర్‌గా ఉన్న కోనేరు ప్రసాద్ మార్కెట్ రేటుకంటే ఎక్కువగా అమ్మి దుబాయ్‌లో ఉన్న కుమారుడి ఖాతాలోకి కోట్లాది రూపాయలు పంపారని సిబిఐ నేరారోపణ చేసింది. దీని వల్ల ప్రభుత్వానికి సుమారు 91 కోట్లు నష్టం తెచ్చారన్న ఆరోపణలపై సిబిఐ విచారణ జరుపుతుంది.
రోజురోజుకూ పెరిగిపోతున్న విఐపిల అరెస్టులతో చెంచల్‌గూడ జైలు నిండిపోతూ వుంది. ఎంత మంది ఎన్ని సార్లు బెయిలు పిటీషన్లు పెట్టుకున్నా కోర్టుకు ఏదో ఒక సాకు చెప్పి సిబిఐ న్యాయవాదులు ఏ ఒక్కరికీ బెయిలు రాకుండా ఆపుతున్నారు. ఎట్టకేలకు 8 నెలల తర్వాత వారిలో ఒకరికి బెయిలు రావడంతో మిగతావారికి కూడా బెయిలు వచ్చే అవకాశం ఉందన్న ఆశ వచ్చింది. ఇప్పటివరకు కోనేరు ప్రసాద్ 5 సార్లు బెయిలు పిటిషన్ పెట్టుకున్నారు. ఇప్పుడు విఐపిలంతా ఒకొరొకరుగా బయటకు వచ్చే అవకాశం కోసం, రోజు ఎదురు చూస్తున్నారు. ఈ వరుస క్రమంలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్‌లు ఉన్నారు. వీరికి ఒక వారంరోజుల్లో బెయిలు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది.