ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రమాణ స్వీకారం
posted on Nov 10, 2022 @ 9:42AM
మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి ఎమ్మెల్యేగా గురువారం(నవంబర్ 10) ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం పదకొండుగంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంతరెడ్డి, జగదీశ్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కూసుకుంట్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మునుగోడు నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయంతో అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 105కు పెరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ బలం ఐదుకు పడిపోయింది.