కృష్ణమ్మకు జలకళ
posted on Aug 4, 2012 @ 10:04AM
నిన్న మొన్నటి వరకు ఇసుకమేటలు వేసి ఎడారిని గుర్తుకు తెచ్చిన కృష్ణానది ఇప్పుడు నీళ్లతో కళకళ లాడుతుంది. కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంలోకి వరదనీరు పెరుగుతుండ టంతో కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా నీటితో నిండితూ వస్తుంది. ఆలమట్టిలో వచ్చిచేరుతున్న వరదనీటి ఇన్‌ప్లో లక్ష క్యూసెక్కులు చేరింది. ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యాంలో పూర్తిస్దాయిలో నిండితే గాని మన రాష్ణ్రానికి నీరందే అవకాశం లేదు. కృష్ణానీటి కోసం ఆయకట్టు రైతులంతా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆలమట్టి పూర్తి నీటినిలువ సామర్ధ్యం 129.721 టి.ఎం.సి.లు కాగా ఉండగా గత ఏడాది ఇదే సమయానికి 110.5 టీఎంసిల నీరుంది.
ప్రస్తుతానికి 78.77 టియంసిల నీరు ఉంది. రోజుకు 10 టియంసిల నీరు చేరుతుందని, ఇలాజరిగితే కేవలం ఐదారురోజుల్లో జలాశయం పూర్తిగా నిండుతుందనిఅధికారులు చెబుతున్నారు.జలాశయం నుండి ఔట్‌ప్లో 1000 క్యూసెక్కులు ఉండగా గురువారం 14వేల క్యూసెక్కుల నీటికి పెంచారు. శ్రీశైలంలోకి మాత్రం ఇన్‌ప్లో ఏమీ లేకపోయినా ఔట్‌ప్లో మాత్రం 42 క్యూసెక్కులుంది. నాగార్జున సాగర్‌లో కూడా ఇన్‌ప్లో లేకపోగా ఔట్‌ప్లో 250 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతానికి కృష్టా డెల్టాకు ప్రకాశం బ్యారేజినుండి 2347 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలా వుండగా గోదావరి ఎగువప్రాంతాల్లో వర్షాభావం వుండగా దిగువప్రాంతాల్లో వరదనీరు వచ్చిచేరుతూ వుంది.