Read more!

కోలగట్ల వైకాపాలోకి జంప్

 

విజయనగరంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో బలమయిన దెబ్బ తగిలింది. అక్కడ ఉన్న బలమయిన రాజకీయ నేతలలో కొలగట్ల వీరభద్రస్వామి కూడా ఒకరు. ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు శాసనమండలి సభ్యుడు కూడా. జిల్లాలో బొత్స సత్యనారాయణ, అశోక్ గజపతి తరువాత అంతటి బలమయిన నేతగా పేరుపొందారు. అటువంటి వ్యక్తి నేడు అకస్మాత్తుగా వైకాపాలో చేరిపోయారు.

 

ఇప్పటికే జిల్లాలో దాదాపు పార్టీ ఖాళీ అయిపోగా, ఇప్పుడు కోలగట్ల కూడా వెళ్లిపోవడంతో, కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అపకీర్తి మూటగట్టుకొన్న బొత్ససత్యనారాయణపైనే తప్పనిసరిగా ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది బొత్సకు సానుకూలాంశంగా మారినందున మళ్ళీ ఇప్పుడు తను సూచించిన వారికే ఆయన టికెట్స్ ఇప్పించుకోగలిగే స్థితికి చేరుకొన్నారు. అదేవిధంగా ఇటువంటి కీలక తరుణంలో కోలగట్ల వైకాపా వైపు మారడంతో జిల్లాలో పార్టీల బలాబలాలు మారాయి. ఆయన వైకాపా తరపున శాసనసభకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. తేదేపాకు జిల్లాలో బలమయిన అభ్యర్ధి అయిన మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుని ఈసారి లోక్ సభకు పోటీలో దింపుతున్నందున, బొత్సను వైకాపాను ఎదుర్కోవడానికి తెదేపా మరో బలమయిన అభ్యర్ధిని వెతుక్కోవలసి ఉంటుంది.