Read more!

రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం

 

ఈరోజే తెలంగాణాలో నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజు గనుక వివిధ పార్టీలలో టికెట్ దొరకని వారిలో స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్లు వేసినవారిలో ఇంకా ఎంతమంది బరిలో నిలిచి ఆయా పార్టీలకు సవాలు విసరనున్నారో, ఎంతమంది తమ నామినేషన్లు ఉపసంహరించుకొంటారో కూడా తేలిపోనుంది.

 

ఇక ఈరోజే ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. అదేవిధంగా ఈరోజు నుండే అక్కడ కూడా అభ్యర్ధుల నుండి నామినేషన్ దరఖాస్తులు స్వీకరణ కూడా మొదలవుతుంది. ఈనెల 19వ తేదీ నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజు. మధ్యలో 13 (ఆదివారం),14 (అంబేడ్కర్ జయంతి),19 (గుడ్ ఫ్రైడే) శలవు దినాలలో మాత్రం నామినేషన్లు స్వీకరించరు. అంటే అభ్యర్ధులకు నామినేషన్లు దాఖలు చేయడానికి కేవలం 5రోజులు మాత్రమే సమయం ఉంటుందన్నమాట. ఈనెల 21 నామినేషన్ల పరిశీలన చేస్తారు. 23మధ్యాహ్ననానికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది.

 

ఏప్రిల్ 30న తెలంగాణాలో పది జిల్లాలో 17 పార్లమెంటు, 119 శాసనసభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా మే 7న ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలలో 25 లోక్ సభ మరియు 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. మే16న ఓట్ల కౌటింగ్ చేసి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు.

 

ఈరోజు నాలుగవ విడత ఎన్నికలలో భాగంగా గోవా, అస్సోం, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలలో ఏడు నియోజక వర్గాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు స్థానాలకు మొత్తం 74మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.