వైఎస్సార్ కార్యాలయం వివాదం.. ఏం చేస్తారో చేసుకోండి.. కొడాలి నాని
posted on Nov 16, 2015 @ 9:37AM
కృష్ణాజిల్లా, గుడివాడలోని వైఎస్సార్ కార్యాలయం వివాదంగా మారింది. వైఎస్సార్ కార్యాలయాన్ని ఖాళీ చేయించి.. కార్యలయం పేరు తొలగించి.. రంగులు వేయించి పోలీసులు యజమానురాలికి అప్పగించారు. దీంతో కొడలి నాని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు కావాలనే పోలీసులను పంపి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.. కార్యాలయం తాళం పగలకొట్టి ఇప్పటి నుండి నేను ఇక్కడే ఉంటాను.. దమ్ముంటే ఏం చేస్తారో చేసుకోండి అంటూ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. దీంతో టీడీపీ నేతలు కూడా కొడాలి నానికి ప్రతిసవాల్ విసిరారు. ఈ సందర్బంగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ కార్యాలయం దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మరీ కొడాలి నాని అక్రమాలను భయటపెడతామని అన్నారు. దీనిలో భాగంగానే బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు.. ఇంకా పలువురు టీడీపీ కార్యకర్తలు కార్యలయం వద్దకు చేరుకున్నారు. దీంతో వివాదం ముదరడంతో గుడివాడలో భారీగా పోలీసులు మొహరించారు.