కిరణ్ సర్కారుపై అసదుద్దీన్ ఆగ్రహం

 

హైదరాబాద్ పాతబస్తీలో భాగ్యలక్ష్మీ ఆలయం వ్యవహారంపై ఎంఐఎం అలిగింది. కాంగ్రెస్ సర్కారుకు మద్దతు ఉపసంహరిస్తామంటూ అల్టిమేటమ్ జారీ చేసింది. ఎంఐఎం పార్టీకి 7గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్నారు. వీళ్లతో కలిపి ప్రస్తుతం కాంగ్రెస్ బలం 158. ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకుంటే కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 151కి పడిపోతుంది. మ్యాజిక్ ఫిగర్ 148.


వాస్తవానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరిస్తే కాంగ్రెస్ కి ఇప్పటికిప్పుడు జరిగే నష్టం ఏమీ లేదు.. కానీ.. పార్టీల బలాబలాల్లో తేడాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయ్. మారిన సమీకరణాలను బట్టి ఎవరైనా జగన్ పార్టీలోకి దూకడమో లేక మరే ఇతర ప్రయత్నం చేయడమో చేస్తే కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడుతుంది.



ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం వల్ల ఎవరికీ ఏలాభం లేదు కాబట్టి ఎవరూ దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితి లేకపోయినా ఓ విధంగా చూస్తే కాంగ్రెస్ బలం ఎంఐఎం మద్దతు ఉపసంహరణవల్ల తగ్గినట్టే. అసలే చిక్కుల సుడిగుండలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి ఇది మరో దెబ్బ. అసలు పరిస్థితి ఇంతవరకూ ఎలా వచ్చిందని అధిష్ఠానం నిలదీసే పరిస్థితి..