కుంభకోణాలకు అడ్డగా హైదరాబాద్: చంద్రబాబు

 

 

హైదరాబాద్ ప్రస్తుతం కుంభకోణాలకు రాజధానిగా మారిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పేదల పేరును అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ ధనాన్ని అడ్డంగా దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. జన౦ అంతా గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని బాబు అన్నారు.


మోసం ఎప్పటికీ దాగదని, జనాల్ని మోసం చేసిన వాళ్ళు ఎప్పటికైనా తప్పించుకోలేరనిని చంద్రబాబు ఆవేశంగా మాట్లాడారు. ఇప్పటికే జనాన్ని మోసం చేసిన వాళ్ళు జైళ్లో వూచలు లెక్కబెడుతున్నారని, కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. అవీనీతి ప్రభుత్వానీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.  

     

కాంగ్రెస్ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయని, ధరలు తగ్గాలంటే టిడిపి అధికారంలోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యత్ ట్రాన్స్ ఫార్మర్లు చెడిపోతే పట్టించుకొనే నాధుడే లేడన్నారు. కనీసం తాగునీటి బోర్లు కూడా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులను 10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు.