కర్ణాటకలో కింగ్ మేకర్ జెడిఎస్
posted on May 11, 2023 @ 3:14PM
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో, ఎగ్జిట్ పోల్‌లలో చాలా వరకు కాంగ్రెస్‌కు బలం చేకూర్చాయి, వాటిలో మూడు అధికార బిజెపీతోతో గట్టి పోటీలో నిలిచాయి. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీని అందించాయి. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 122 నుండి 140 సీట్లు సాధిస్తుందని అంచనా. న్యూస్ 24-టుడే చాణక్య ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ పార్టీ 120 సీట్లు గెలుచుకుంటుందని అంచనా . 224 మంది సభ్యుల సభలో అధికార బిజెపి మెజారిటీ సాధిస్తుందని కేవలం ఒక పోల్‌స్టర్-న్యూస్ నేషన్-సిజీఎస్ అంచనా వేసింది. చాలా సర్వేలు జేడీ(ఎస్)కి 20-స్థానాలు వస్తాయని అంచనా వేసింది. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ 37 స్థానాలు గెలుచుకుంది. బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన మొదటి దక్షిణాది రాష్ట్రం కర్ణాటక కావడం విశేషం. సర్వేల ప్రకారం అధికారం బీజేపీ నుంచి కాంగ్రెస్ చేతుల్లోకి మారనుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచారంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తుంది. 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలోపు బలమైన పునరాగమనం చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఎన్నికల సంఘం ప్రకారం 72.67 శాతం ఓటింగ్ నమోదైంది. కాంగ్రెస్ , జనతాదళ్ (సెక్యులర్) 2018 ఎన్నికలలో మిత్రపక్షాలుగా పోటీ చేసి పరాజయం చెందాయి.
జనతాదళ్ (సెక్యులర్)తో ఎన్నికల తర్వాత పొత్తు ఉండదని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ బుధవారం ఉదయం విలేకరులతో అన్నారు.2018 ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్, జెడిఎస్ జతకట్టాయి. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరడంతో వారి ప్రభుత్వం కూలిపోయింది. "జెడిఎస్‌తో పొత్తుకు అవకాశాలు లేవు. మేమే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం"అని శివకుమార్ అన్నారు. కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశాలు లేవని తెలుస్తోంది. అధికారంలో వచ్చే పార్టీలకు జేడీఎస్ మద్దత్తు ఇస్తే సరిపోతుంది. కాబట్టి జెడిఎస్ కింగ్ మేకర్ అని చెప్పొచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న జెడీఎస్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా? బిజెపీతో పొత్తు పెట్టుకుంటుందా? వేచి చూడాలి.