మూత్ర పిండాలలో రాళ్ళు ప్రమాదమా?
posted on Aug 7, 2021 @ 9:30AM
మూత్ర పిండాలలో రాళ్ళు ఏర్పడడం ఈ మధ్యకాలంలో చాలా తరచుగా వింటున్నాం.
సగటున జనాభాలో 1౦,౦౦౦ మంది లో 7నుండి 21 మంది కి మూత్ర పిండాలలో
రాళ్ళు ఏర్పడు తున్నట్లు గా తెలుస్తుంది.మూత్ర పిండాలలో రాళ్ళూ ఏర్పడడం స్త్రీలకంటే పురుషులకు 8౦ %కేసులు పురుషులకే సంబందించినవే అయి ఉంటాయి అని నిపుణులు అంచనా.
మూత్ర పిండాలలో రాళ్ళు అంటే ఏమిటి?
వైద్య పరంగా మూత్ర పిండాలలో ఏర్పడే రాళ్ళను కాల్సులి అంటారు.సాధారణంగా రాళ్ళు మూత్ర పిండాల లోపల ఏర్పడుతూ ఉంటాయి.కాని బ్లాడర్ లోను యురేటర్ మూత్ర నాళం లోను కూడా రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. రక్తంలో కాల్షియం పాస్పరస్,యూరిక్ యాసిడ్ లవణాలు సాల్ట్స్ అధికం కావడం మూలంగా రాళ్ళు ఏర్పడుతాయి.అధికంగా ఉండే లవణాలు స్పటిక రూపాన్ని దాల్చి కిడ్నీ లోపలి పొరలి పొరల మీద నిల్వ ఉంటాయి. లేక పోతే మూత్ర వ్యవస్థ యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు గురికావడం మూలంగా కూడా మూత్రపిండాలలో రాళ్ళు ఎపడుతాయి. కిడ్నీలో గాని బ్లాడర్ లో గాని ఇసుక రేణువు సైజు నుంచి బత్తాయి పండు సైజు దాకా ఉండే రాళ్ళు ఆయా భాగాలలో కదల కుండా ఉన్నంతవరకూ మనకేమీ బాధను కలిగించవు అసలు ఏమి లేదన్నట్ట్లుగానే కనిపిస్తాయి. కాని సజులో ఎంత చిన్న రాయి అయినా సరే కిడ్నీ నుంచి బ్లాడర్ లోకి జారుతున్నప్పుడు యురేటర్ లోపలి సున్నితమైన పోరా దెబ్బతినడం మొదలు పెట్ట గానే మనకు భరించలేని బాధ కలుగుతుంది.
మూత్ర పిండాలలో రాళ్ళు ఉంటె లక్షణాలు ఎలా ఉంటాయి...
వీపు కింది భాగాన్ చెప్పరానంత తీవ్రంగా నొప్పి మొదలై ముందు వేపు పొత్తికడుపు దాకా వ్యాపిస్తుంది.అకాది నుంచి వృషణాల నుంచిపురుషాంగం లేదా స్త్రీల కైతే జననేన్ద్రియం వరకూ వ్యాపిస్తుంది. కిడ్నీ రాయి కిడ్నీ మూత్ర పిండం నుంచి మూత్ర్రాశయం దాకా ఉన్న మూత్రనాళము ఉన్న ట్యూబ్ లో కదుల్తున్న కొద్దీ నొప్పి అలలు అలలు గా కదులుతూ బాధ పెడుతుంది. ఈ నొప్పి తీవ్రత కొంత సేపటి తరువాత పతాక స్థాయికి చేరుకొని ఒక నిమిషం పాటు అలా ఉండి తరువాత తగ్గి పోతుంది.అంతలోనే కొద్ది నిమిషాలాలో మళ్ళీ మొదలు అవుతుంది. అప్పుడప్పుడూ తెమలడం, వణుకుతూ కూడుకున్న జ్వరం వాంతులు కూడా ఉండవచ్చు. మూత్రం పోస్తునప్పుడు నొప్పి ఉంటుంది. ఒక్కో సారి మూత్రంలో నెత్తురు వీపుకింది భాగాన్ని కానిపోత్తికడుపుని కానీ అంటుకుంటే చాలు నొప్పి మొదలు అవుతుంది.
రాళ్ళు ఏర్పడడానికి ఎంతకాలం పడుతుంది...
పెద్ద రాళ్ళూ ఏర్పడడానికి సంవత్సరాలు ఏర్పడవచ్చు.కొన్ని చిన్న రాళ్లు మాత్రం ఒకటి లేదా రెండు
నెలల్లో ఏర్పడుతాయి.
కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణాలు...
సహజంగా చెప్పాలంటే మూత్రంలో రసాయనాలు బాగా చిక్కబడి స్పటిక రూపానికి మారడం వల్ల రాళ్ళు ఏర్పడుతాయి. ఇలా చిక్కబాడడానికి కారణాలు ఏమిటి అని చూస్తే
---రాళ్ళు ఏర్పడే శరీరతత్వం కలిగి ఉండడం.
--రోజూ తీసుకునే ఆహారం లో కాల్షియం,ఇతర ఖనిజ లవణాలు కొన్ని అధికం గా ఉండడం వల్ల ఒక్కో ప్రాంతం లో ఆయానేలలలో నీటిలో లవణాలు అధికంగా ఉండడం వల్ల యూరిక్ యాసిడ్ అధికం కావడం వల్ల కొన్ని రకాల మందులు విటమిన్ సి లేదా విటమిన్ డి అధికంగా తీసుకోవడం వల్ల లేదా ప్రతి రోజూ సరిపడా నీరు తాగక పోవడం వల్ల మూత్రనాళం ఇన్ఫెక్షన్ కి గురికావడం వల్ల. అతిగా చెమట పడుతూ శరీరంలోని నీటిని అధికంగా విసర్జిమ్పచేసే ఉష్ణ మండల ప్రదేశాలాలో నివసించే వారికి.
అనారోగ్యం కారణాల వాళ్ళ దీర్ఘ కాలం పాటు మంచం మీదనుండి దిగాలేనివారికి పనీ పాటా లేకుండా శారీరక కష్టం లేకుండా కాలం గడిపే వాళ్ళకి కిడ్నీలో రాళ్ళు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
కిడ్నిలో రాళ్ళు ఉంటె అనార్ధాలు...
కిడ్నీలో అంటే మూత్రపిండాలలో చీముచేరి దెబ్బతింటుంది.
కిడ్నీ రాళ్ళకు చికిత్స్ద్స ...
కిడ్నీ లో రాయి చిన్నదిగా 5 మీ మీ ఉంటె ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే మూత్రం గుండా వెళ్లి పోతుంది. కిడ్నీ లో రాయి సైజు 5 నుంచి1౦ మీ మీ దాకా ఉంటె ఉంటె పెద్దగా అవుతున్నకొద్దీ డానికి అది బయటికి పోదు. 1౦ మీ మీ సైజు లో ఉంటె రాయిని సర్జరీ ద్వారా లేదా లితో ట్రీప్సీ ద్వారా రాయిని తొలగించాల్సి ఉంటుంది.
లితో ట్రీ ప్సీ...
లితో ట్రీ ప్సీ ద్వారా చే సే చికిత్సలో ఎక్ష్ రే ద్వారా రాయి ఎక్కడుందో పసిగట్టి సరిగ్గా ఆభాగాన హై ఎనర్జీ షాక్ వేవ్ ని ఫోలాస్ చేయడం ద్వారా మూడు గంటలు సాగే ప్రక్రియలో రాయి చిన్న చిన్న ముక్కలు కింద పడిపోయి మూడు నాలుగు నెలల లోపల మూత్రం ద్వారా ఒక్కొకటిగా బయటికి వెళ్ళిపోతాయి.
సర్జరీ చికిత్స...
సర్జరీ లో డాక్టర్ కిడ్నీ ని తెరచి లోపలి రాళ్ళను బయటికి తీసేస్తారు. సర్జరీలో ఉండే అసౌకర్యం ఏమిటి అంటే కిడ్నీ ని కోసి తెరిచి నప్పు డల్లా కిడ్నీ తన సామర్ధ్యం లో మాటి మాటికీ కిడ్నీ సామార్ధ్యం 2౦% కోల్పోతుందని అంటున్నారు. కిడ్నీ రాళ్ళను తొలగించడానికి యురేటేరోస్కొపి ,పెర్కుతనెఔస్ ఇవి కాక కొన్ని ఆధునిక పద్దతులు అందుబాటులోకి వచ్చాయి.
కిడ్నీలో రాళ్ళూ పడకుండా జాగ్రత్తలు...
మంచి నీలాను ధారాళంగా తాగాలి.దీనివల్ల మూత్రం పల్చ బడవచ్చు.ఎక్కువ నీరు తాగడం వల్ల సాల్ట్స్,ఖనిజ లవణాలు కాన్సన్ ట్రేట్ కాకుండా ఉండి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి.రోజూ షుమారు న రెండు మూడు లీటర్ల నీరు తాగడం మంచిది వేసవి కాలంలో ఇంకా ఎక్కువానీరు తాగాలి. కిడ్నీలో ఏర్పడే రాళ్ళలో 92%కాల్షియం మూలంగానే ఏర్పడటాయి.కాల్షియం ఉత్పత్తుల మూలంగా ఏర్పడతాయి.కిడ్నీలో రాలు ఏర్పడే అవకాసం ఉన్నదని భా వించిన వాళ్ళు కాల్షియం ఉత్జ్పట్టులను పూర్తిగా మానేయకూడదు.తగిన మోతాదులో మితంగా మాత్రమే తీసుకోవాలి. ఈ విషయంలో డాక్టర్ సలహాను తీసుకోవడం మంచిది.కాల్షియం అదనంగా ఉండే పదార్ధాలు పాలు వెన్న,పాల ఉత్పత్తులు.