కేరళ మాజీ సీఎం ఉమెన్ చాంది కన్నుమూత
posted on Jul 18, 2023 7:04AM
కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని చిన్మయ మిషన్ హాస్పిటల్ చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. ఉమెన్ చాంది మరణించారని ఆయన కుమారుడు తన ఫేస్ బుక్ ద్వారా పేర్కొన్నారు.
ఉమెన్ చాంది మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక లెజెండ్ ను కోల్పోయామని కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకరణ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఉమెన్ చాంది 1970లొ తొలి సారిగా పూతుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై చట్ట సభలో అడుగుపెట్టారు. ఆ తరువాత అదే నియోజకవర్గం నుంచి 12 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1977లో కేరుణాకరణ్ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. ఆ తరువాత 2004 నుంచి 2006 వరకూ, 2011 నుంచి 2016 వరకూ కేరళ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
ఉమెన్ చాందీ 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నియోజకవర్గం నుంచి 1970లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమెన్ చాందీ వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1977 లో కె. కరుణాకరన్ కేబినెట్ లో తొలిసారి మంత్రిగా పనిచేశారు. ఉమెన్ చాందీ రెండు సార్లు(2004-2006, 2011-2016) సీఎంగా పనిచేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా కూడా పని చేశారు.