కియోలాకి తెలిసింది జొనాస్ కష్టం!
posted on Oct 24, 2022 @ 1:24PM
చెట్లు సమాచారాన్ని పంచుకుం టాయిట, జంతువులు మాట్లాడు కుంటాయిట, పిల్లల కష్టాలు తల్లి గ్రహించగలదు, పెంపుడు జంతు వులు యజమాని కష్టాలు తెలు సుకోగలవుట..లోకంలో అనేకా నేక అద్భుతాలు. ఎవరో చెబితేనే నమ్మక్కర్లేదు.. కొన్ని అనుభవ పూర్వకంగానే తెలుస్తాయి. కియోలాకి తెలిసింది జోలిని జొనాస్ కష్టం అలానే తెలిసింది.
జొలిని జొనాస్, రికీ బాల్య స్నేహి తులు, తర్వాత పెళ్లి చేసుకు న్నారు. వారు ఒక గుర్రాన్ని పెంచుకున్నారు. దాని పేరే కియోలా! ఎంతో సరదాగా గడుస్తోంది కాలం. జొనాస్ గర్భ వతి అయింది. కొద్ది నెలలకు కియోలాను కాస్తంత దూరంగా మెదిలేలా చేశాడు రికీ. దానికి అర్ధం కాలేదు. రోజు వచ్చి ముద్దుపెట్టేది దగ్గరికీ రావడం లేదని. ఆమె మెల్ల మెల్లగా నడవడం గమనించి ఏదో అయిందని అర్ధమయింది. ఆమె రెండు రోజులకోసారి డాక్టర్ దగ్గరికి వెళుతూండేది. వచ్చేవరకూ కియో ఎదురు చూస్తుండేది. నెలల నిండుతున్న తరుణంలో ఆమె వెన్ను నొప్పితో బాధపడింది. ఒకసారి కియో ఆమెను డాక్టర్‌దగ్గరికి వెళ్ల కుండా అడ్డుకుంది. ఆమెను దగ్గరకి లాక్కుని హత్తుకుంది. దీనికి ఏదో అయిందనిపించింది. ఆ తర్వాత నాలుగయిదు రోజులు అలానే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా చేసింది. దాని అర్ధమేమిటో దంపతులకు తెలియదు, కియోలా మాటల్లో చెప్పలేదు.. అదే ఏదో అనారోగ్యంతో బాధ పడుతోందేమో అనుకున్నారు.
కొద్దిరోజుల్లో ఆపరేషన్ అనగా డాక్టర్ దగ్గరికి వెళ్లింది జొనాస్. డాక్టర్ చెక్ చేసినపుడు ఆశ్చర్యపోయారు. ఆమెకు వెన్నునొప్పికి కారణం ఆమె గడుపులో ఏదో చిప్ ఉండడం వల్లనే అని ఎక్స్‌రేలో తెలిసింది. అయితే తల్లీ, పాప క్షేమంగా ఇంటికి వచ్చారు. డాక్టర్లు అనుమానం వచ్చి పోలీసులకు చెబితే వారు అనుమానితులుగా అయిదుగురిని పట్టుకున్నారు. వారిలో ఒకడు జోనాస్ మొదట సంప్రదించిన డాక్టర్ కూడా ఉన్నాడు. ఆమెకు ఆశ్చర్యమేసింది. వీడే చిప్‌తో ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసే యత్నాలు చేశాడని తేలింది. ఇది అమెరికాలో నేరం. ఆ గ్యాంగ్‌ని పోలీసులు కటకటాల్లోకి తోసారు. బిడ్డతో జొనాస్, రికీ ఇంటికి వెళ్లారు. రెండు రోజుల తర్వాత బిడ్డని కియోకి చూపించింది. అది ఎంతో ప్రేమతో ఆమె బుగ్గల్ని నాకింది. రక్షించినం దుకు ఆమె ముద్దాడింది!