కేజ్రీవాల్ ఇంటిపై డ్రోన్ కెమెరా చక్కర్లు
posted on Apr 26, 2023 @ 10:46AM
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భధ్రత కొరవడిట్టు కనబడుతోంది.
కేజ్రీవాల్ ఇంటి వద్ద డ్రోన్ కెమెరా కనబడిందని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది. ముఖ్యమంత్రి ఇంటి వద్ద డ్రోన్ కెమెరా ఎవరు తిప్పారు అనే విషయాన్ని భధ్రతా బలగాలు ఆరాతీస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడానికి గల కారణాలను ఢిల్లీ పోలీసులు అన్వేషిస్తున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ కు భధ్రతాపరమైన సమస్య ఇది మొదటి సారి కాదు. గత సంవత్సరం మార్చిలో కేజ్రీవాల్ ఇంటి వద్ద కొందరు వ్యక్తులు దాడి చేశారు. అప్పట్లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోసిడియా ఒక ట్వీట్ చేశారు. సంఘ విద్రోహశక్తులు ముఖ్యమంత్రిని హత్య చేయాలని చూస్తున్నాయని కామెంట్ చేశారు . సీసీటీవీని ధ్వంసం చేశారని ఆరోపించారు. భధ్రతా బలగాల మీద కూడా దాడులు చేశారన్నారు. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఢిల్లీ పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం బీజేపీ యువమోర్చాకు చెందిన 150 నుంచి 200 మంది దాడి చేసినట్లు ఎఫ్ ఐ ఆర్ లో నమోదైంది. సాక్షాత్తు ముఖ్యమంత్రికే భధ్రత కొరవడడం ఆసక్తి నెలకొంది.
మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్రపై సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. మద్యం కుంభకోణంలో విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఢిల్లీ ముఖ్యమంత్రిని ఆరా తీసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మద్యం కుంభకోణం విషయంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కుమార్తెను విచారించిన దర్యాప్తు సంస్థ నేరుగా ముఖ్యమంత్రిని విచారించాలని నిర్ణయించడం సంచలనం రేకెత్తించింది. పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ ట్వీట్ చేస్తూ బిజేపీ ప్రభుత్వ దమనకాండకు చక్కటి నిదర్శనమని విమర్శించారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలు పాలయిన సంగతి తెలిసిందే. కేంద్ర దర్యాప్తు సంస్థ గత ఫిబ్రవరి నెలలో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో బీజేపీ ప్రభుత్వం సీరియస్ గా వుంది. అయితే ముఖ్యమంత్రి ఇంటిపై డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది.