కేజ్రీ, మీ అమాయకత్వానికి జోహార్లు!
posted on Oct 26, 2022 @ 2:32PM
దేవుడంటే భయభక్తులు ఉండాలి. అన్నీ దేవుడే చేసేస్తాడు మనం పెద్దగా కష్టపడక్కర్లేదనుకుంటేనే సమస్య. అంద రికీ మతపిచ్చి పట్టించి తీరిగ్గా సంప్రదాయాలు, గ్రంథాలు ఇలా చెప్పాయంటూ జనాన్ని వెర్రాళ్లను చేసి ఓటర్లుగా మార్చుకుని రాజకీయ లబ్ధి చేకూర్చుకునే అతి తెలివి మాత్రం ఒక్క బీజేపీ వారికే సాధ్యం. అసలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దేశంలో మతమౌఢ్యం పెచ్చుమీరుతోందనే వాదనా ఉంది. ప్రతీదాన్ని మతపరంగా ఆలోచించి చిన్న సమస్యను కూడా పరిష్కారానికి అనేక సం త్సరాలు పట్టేంతగా లాగే యుక్తి కేవలం బీజేపీ వారి సొత్తు. ప్రతీ రాజకీయ ఆలోచన వెనుక మతప రమైన రంగుతో మేళవించి జనాల్లోకి వదిలి గందరగోళం కలిగించి ఆనందించడం మోడీ అండ్ కో వారి ప్రత్యేకత. ప్రశాంతంగా ఉంటే వారికి చాలా ఇబ్బంది. నిద్రపట్టదు. వారికి కొత్త ఆాలోచన కలిగించారు ఆప్ అధినేత కేజ్రీవాల్.
నోట్ల మీద గాంధీ గారి బొమ్మ ఎలాగూ ఉంటుంది, ఉండాలి. నోటుకి రెండో వేపు గణేషుడు, లక్ష్మీ దేవి బొమ్మలు కూడా ఉంటే బావుంటుంది అని కేజ్రీవాల్ సూచించారు. గణేషుడు శుభాలను కలిగిస్తాడు, లక్షీ దేవి ధనప్రాప్తి కలిగిస్తుంది. అందువల్ల వారిద్దరి బొమ్మలు ప్రచురించాలన్నారు. అయితే దీని కోసమని ఇప్పటిదాకా ఉన్న నోట్లను తీసేయమన లేదు. జనాలు మళ్లీ ఇబ్బందుల పాలయ్యేవారు. డీమానిటైజే షన్ పేరుతో మధ్య తరగతి, పేదలను జేబులు ఖాళీ చేయించి నానా అవస్థలకు గురిచేసి బీజేపీ సర్కార్ ఆనందించిన సంగతి తెలిసిందే. పైగా విదేశాల నుంచి నల్లధనాన్ని తెప్పించి అందరికీ పంచుతామ న్నారు, సినిమాలో పేద్ద హీరో వాగ్దానంలా. ఏదీ జరగలేదు. బ్లాక్ మనీతో ఉడాయించిన ఘనులు విదేశా ల్లో చాలా ప్రశాంతంగా, సుఖంగానే ఉన్నారు. కష్టాలు మనకే పట్టించారు ప్రభువుల వారు.
కేజ్రీవాల్ బీజేపీవారి భక్తిపారవశ్యాన్ని, దేశంలో ఎవరికీ లేని మత ప్రభావాన్ని గురించి సరదాగా అలా సూచించారేమోగాని, వాస్తవానికి గాంధీగారి బొమ్మే తీసేసి తమ బొమ్మ పెట్టేసుకున్నా పెద్దగా ఆశ్చర్య పడనవసరం లేదు. ఎందుకంటే బీజేపీ వారి దృష్టిలో గాంధీ కంటే, పటేల్ సమానుడు మోదీ. ఆయన తోనే సమస్త భారతావని అభివృద్ధిపథంలో ముందడుగు వేస్తోందనే అభిప్రాయాలు, నమ్మకాలు ముమ్మ రంగా ప్రచారంచేస్తూ సామాన్య జనాన్ని, ముఖ్యంగా ోటర్ని జేబులో వేసేసుకుంటున్నారు. ప్రతీ ప్రాంతంలోనూ ప్రధాని, హోం మంత్రి షా గారి అదేశాలు తూ.చ తప్పకుండా అమలు చేయడంలోనో, ప్రచారం చేయడలోనో కాస్లంత కఠినంగానే నవ్వుతూ జనాన్ని పనిగట్టుకుని ఆనందంగా ఉండాలన్న ఆదేశాలూ జారీ చేస్తున్నారు. ఇంతగా గతంలో ఎన్నడూ బలవంతపు నవ్వులు ప్రజలు చిందించ లేద న్నది రాజకీయపరిశీలకుల మాట.
ప్రతీ ప్రాంతంలో రాజకీయాలతో పాటు మతపరమైన ఆాలోచనను కలగలిపి వ్యూహరచన చేసి తమవారిని రెచ్చగొట్టి ప్రచారం చేయించి గొడవలు తేవడం, టీవీల్లో, వీధుల్లో, కార్యాలయాల్లో చర్చలకు దారితీసేట్టు చేయడం బీజేపీకి మహా సరదా. మహానగరాలకు పేర్లు మార్చడం, చారిత్రక కట్టడాల పేర్లు మార్చడంతో బీజేపీ వారి అసలు అజెండాను దేశ వ్యాప్తంగా విస్తిరించారు. దీన్ని గురించి ప్రజలు తెలుసుకుని, విని, చదివి చర్చించుకోవాలని, విభేదించుకోవాలని, అలా తమకు ఆనందం కలిగించా లని ప్రభువుల ఆలోచన. ప్రభువుల మనసు రాజమందిరం. దేనికయినా దేన్నయినా తమ రాజకీయ లబ్దికి తిప్పేసుకోగల చతురత కలిగినవారు, చదరంగం బాగా నేర్చినవారు. ఇప్పుడు కేజ్రీవాల్ సరదాగా చేసిన సూచన సరదాగానే తీసుకోకున్నా.. ఇటువంటి గొప్ప ఆలోచన కమలనాథులకు రాలేదను కోవడమే కేజ్రీవాల్ అమాయకత్వం.