Read more!

పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపం.. మేమే పరిహారం చెల్లిస్తాం.. కేసీఆర్

ప్రకృతి వైపరీత్యాల విషయంలో కూడా కేసీఆర్ కేంద్రంతో తగవుకే మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా  పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పంట నష్టం వివరాలను నివేదిక రూపంలో కేంద్రానికి పంపే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్రానికి తెలంగాణ నుంచి దండుకోవడమే తప్ప తెలంగాణకు ఇవ్వడం తెలియదని అన్నారు.

గతంలో పంపిన నివేదికలకు సంబంధించిన పరిహారమే ఇప్పటి వరకూ కేంద్రం ఇవ్వలేదన్న కేసీఆర్.. ఈ సారి పంట నష్టం వివరాలను కేంద్రానికి పంపే ప్రశక్తే లేదనీ, రైతలను తమ ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రకటించారు.  ఇటీవలి అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.  ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న పంటలను   ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం (మార్చి 23) పరిశీలించారు. ఆ తరువాత విలేకరులతో మాట్లాడిన ఆయన పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు.

గతంలో పంపిన వాటికే మోడీ సర్కార్ ఇంత వరకూ పరిహారం ఇవ్వలేదని కేసీఆర్ అన్నారు.   బోనకల్లు, రామాపురం, రావినూతల ప్రాంతాలలో అకాల వర్షాలకు దెబ్బతిన్న  దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేసీఆర్ బాధిత రైతులతో మాట్లాడారు.

ఆ సందర్భంగా ఎకరాకు 50 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రైతులు ఆయనకు విజ్ణప్తి చేశారు.  రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మొత్తం 2,28,255 ఎకరాల్లో పంట దెబ్బతిందని సీఎం కేసీఆర్ చెప్పారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.