గజ్వేల్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న కెసీఆర్
posted on Aug 9, 2023 @ 1:22PM
ఉమ్మడి రాష్ట్రంలో గజ్వేల్ నియోజకవర్గానికి అరుదైన రికార్డు ఉంది. ఆ సంప్రదాయం తెలంగాణా రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత కూడా కొనసాగుతోంది.
ఉమ్మడి రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత నుంచే గజ్వేల్ నియోజకవర్గానికి పెద్ద సెంటిమెంటే ఉంది.
అయితే గజ్వేల్ చరిత్ర పరిశీలిస్తే మాత్రం…సీఎం సీటుకు…గజ్వేల్‌లో గెలుపుకు మాత్రం పెద్ద లింక్ ఉంది అనే చెప్పాలి. ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్ 2014,2018 ఎన్నికల్లో
ఇక్కడి నుంచి పోటీ చేశారని అర్ధమవుతోంది. ఈ సెంటిమెంట్‌ను ఈ సారి కూడా ఆయన ఫాలో అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తోంది. గజ్వేల్‌లో గెలిచిన పార్టీయే అధికారంలోకి వస్తుంది. ఇది ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఉన్న సెంటిమెంట్. ఇప్పటివరకూ అయితే ఈ సెంటిమెంట్ బ్రేక్ అయింది లేదు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత తొలి సారి గజ్వేల్ నియోజకవర్గం పీపుల్స్ డెమాక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి పెండెం వాసుదేవు పోటీచేసి గెలుపొందారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగలిగింది.1957లో జెబి ముత్యాలరావు గజ్వేల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
1972, 1978 ఎన్నికలలో గజ్వేల్ ఎస్సీ రిజర్వ్‌డ్ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గజ్వేల్ సైదయ్య గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆతర్వాత 1983లో టిడిపి అభ్యర్థి అల్లం సైదులు విజయం సాధించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
1989లోఢాక్టర్ జె. గీతారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవడంతో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది.
1994 ఎన్నికల్లో విజయరామారావ్,,1999 ఎన్నికల్లో బి. సంజీవరావు టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందడంతో టీడీపీ అధికారంలో రాగలిగింది.
1989లో కాంగ్రెస్ తరపున డాక్టర్ జె. గీతారెడ్డి పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు కాంగ్రెస్ విజయ కేతనం ఎగరేసింది. 1994 ఎన్నికల్లో జి. విజయరామారావు, 1999 ఎన్నికల్లో బి. సంజీవ రావు టీడీపీ అభ్యర్థులుగా గెలుపొందడంతో మళ్లీ టీడీపీ అధికారంలో వచ్చింది.
2004లో డాక్టర్ జె. గీతారెడ్డి రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరిగి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. 2009లో జి.నర్సారెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఈ సారి కూడా మళ్లీ కాంగ్రెస్ అధికారంలో వచ్చింది.
వచ్చే ఎన్నికలలో హ్యాట్రిక్ కొట్టడానికి కెసీఆర్ యత్నిస్తున్నారు. 2014,2018 ఎన్నికల్లో విజయాన్ని కైవసం చేసుకున్న కెసీఆర్ మూడో సారి హ్యట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. 2014,2018లో కెసీఆర్ మీద వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ వేవ్ లో గజ్వేల్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని కెసీఆర్ భావిస్తున్నారని, అందుకు తాను గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.