కేసీఆర్ సరికొత్త రికార్డ్.. తొలిసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నాయకుడు
posted on Mar 31, 2016 @ 1:13PM
ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా..మరో రికార్డును కేసీఆర్ సొంతం చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో సమగ్ర జల విధానంపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేన్ ఇస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా ఏ నాయకడు ఇంత వరకూ ఇలా అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇవ్వలేదు. అటు పార్లమెంటులోనే కాక ఇటు దేశంలోని ఏ ఒక్క నేత కూడా చట్టసభలో ఇప్పటిదాకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన దాఖలా లేదు. చట్టసభల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట సరికొత్త రీతిలో ప్రసంగించిన ఆయన సరికొత్త రికార్డు నెలకొల్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. జలవిధానం, ప్రాజెక్టుల పునరాకృతి, కొత్త పథకాల రూపకల్పన గురించి వివరించారు. ప్రపంచంలోనే తొలి భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిజాంసాగర్ అని.. 75 వేలకు పైగా చెరువులు కాకతీయులు నిర్మించారని, కులీకుతుబ్ షా హుస్సేన్ సాగర్ నిర్మించారని, కాకతీయులు, రెడ్డిరాజుల స్ఫూర్తిని కులీకుతుబ్ షా కొనసాగించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి 11 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, అంతర్రాష్ట్ర వివాదాల్లో కూరుకుని ముందుకుపోని ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతుల్లో మరికొన్ని ప్రాజెక్టులు ఇరుక్కపోయాయన్నారు. గోదావరిలో రాష్ట్రానికి రావాల్సింది 954 టీఎంసీలు, కృష్ణాలో 299 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.