*చెప్పు తొ కోడతా.. ఎంపీ అర్వింద్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్
posted on Nov 18, 2022 @ 1:18PM
‘ఇన్ని రోజులు సహనం పట్టిన.. అరేయ్ అరవింద్ మరోసారి నా గురించి పిచ్చి పిచ్చి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడ్తా బిడ్డ’ ఇవీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు. నోరు అదుపులో పెట్టుకోక పోతే నిజమాబాద్ చౌరస్తా లో చెప్పు తొ కోడతా.. ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడకు వెళ్లి అరవింద్ ను ఒడిస్తానని శపథం చేశారు.
కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు కవిత ఫోన్ చేశారనీ, ఆమె కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు ప్రయత్నించారనీ నిజామాబాద్ ఎంపీ చేసిన వ్యాఖ్యలే కవిత ఆగ్రహానికి కారణం. కవిత బీఆర్ఎస్ ఆవిర్భావ సభకుడుమ్మా కొట్టడంనిజం కాదా అని అర్వింద్ ప్రశ్నించారు. తాను ఖర్గేతో మాట్లాడినట్లుగా కవితే కేసీఆర్ కు చెప్పారని అరవింద్ ఆరోపించారు. కేసీఆర్ ఏమో దానిని మార్చి బీజేపీ వాళ్లే కవితకు ఫోన్ చేశారంటూ అబద్ధాలు చెప్పారనీ అర్వింద్ అన్నారు. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది.
అర్వింద్ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ లోని అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి జరిగిన సమయంలో ఎంపీ అర్వింద్ నిజామాబాద్ లో ఉన్నారు. అసలేం జరిగిందంటే కవిత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఫోన్ చేశారంటూ అర్వింద్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అర్వింద్ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్‌లో ఆయన ఇంటిపై దాడి చేశారు టీఆర్‌ఎస్, జాగృతి కార్యకర్తలు. వంద మంది ఇంట్లోకి వెళ్లి కుర్చీలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పులకుండీలను పగొలగొట్టారు. కర్రలు, రాళ్లతో ఇంటిపై దాడి చేశారు. ఇల్లంతా ధ్వంసం చేశారు.
ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా అర్వింద్ వ్యాఖ్యలపై కవిత సీరియస్ అయ్యారు. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతామన్నారు. కొట్టి కొట్టి చంపుతామన్నారు. ఎక్కడ పోటీ చేసినా వెంటాడి వెంటాడి ఓడిస్తానని సవాల్ చేశారు కవిత. అంతే కాకుండా అర్వింద్ అనుకోకుండా ఎంపీ గా అయ్యారన్నారు. 186 మంది అభ్యర్థులను నిజామాబాద్‌లో బరిలో దింపారని, కాంగ్రెస్ తో కుమ్మక్తై తననను ఓడించారని కవిత అన్నారు.
పసుపు బోర్డు తెస్తానని అర్వింద్ రైతులను మోసం చేశారని మండిపడ్డారు. అరవింద్‌ది ఫేక్ డిగ్రీ అనీ, దీనిపై తాను రాజస్థాన్ యూనివర్సిటీ కి పిర్యాదు చేస్తాననీ కవిత పేర్కొన్నారు. తనకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చిన మాట నిజమేనని కవిత వెల్లడించారు. షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడం పై మాట్లాడారని వివరించారు. తెలంగాణ లో షిండే మోడల్ నడవదని కవిత తేల్చి చెప్పారు. .జై మోడీ అన్న వారి పైన ఈడీ దాడులు ఉండవన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ..మోదీ అల్లుళ్లని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ ఎప్పుడో చెప్పారన్నారు. తాము ఈడీ దాడులకు భయపడమని.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి తీరుతామని అన్నారు.
ఇలా ఉండగా అర్వింద్ నివాసంపై దాడిని బీజేపీ రాష్ట్ర నాయకులు తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు ప్రజాక్షేత్రంలో ఈ దాడికి టీఆర్ఎస్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కాగా తన నివాసంపై జరిగిన దాడిపై ఎంపీ అర్వింద్ ప్రధాని మోడీ, పీఎంవోలకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తన నివాసంపై జరిగిన దాడిపై ట్విట్టర్ లో స్పందించిన అర్వింద్ టీఆర్ఎస్ గూండాలు దాడి చేసి వస్తువులు పగులగొట్టి బీభత్సం సృష్టించారనీ, తన తల్లిని బెదరించారనీ పేర్కొన్నారు.