స్టాలిన్ కు భద్రతా పెంచండీ... ప్రధాని గారు
posted on Jan 29, 2014 @ 4:14PM
కరుణానిధి కుమారులైన అళగిరి, స్టాలిన్‌లకు మధ్య వైరుధ్యాలు తీవ్రస్థాయికి చేరి ఉభయుల మధ్య శత్రుత్వం పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా తన రెండో కుమారుడు స్టాలిన్‌కు భద్రత కల్పించాలంటూ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు డీఎంకే అధినేత కరుణానిధి లేఖ రాశారు. ఇటీవల అళగిరి తన తండ్రి(కరుణానిధి) వద్దకు వెళ్లి మూడు నెలల్లో చనిపోయే వ్యక్తికి పదవులు ఎందుకు అని ప్రశ్నించడంతో అవాక్కైన కరుణానిధి వెంటనే అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం కూడా తెలిసిందే. ఒక కుమారుడిపై మరో కుమారుడు చేసిన 'అమానవీయ' వ్యాఖ్యలను తండ్రిగా భరించగలను కానీ పార్టీ రథసారథిగా భరించలేనని, అందుకే అళగిరిని బహిష్కరించ వలసి వచ్చిందని కరుణానిధి స్వయంగా మీడియాకు వివరించారు.ఈ నేపథ్యంలో అళగిరి తన మరో కుమారుడు స్టాలిన్‌కు భౌతికంగా అపకారం తలపెట్ట వచ్చునన్న అనుమానంతోనే ఇప్పుడు స్టాలిన్‌కు భద్రత కల్పించాల్సిందిగా అభ్యర్థిస్తున్నట్లు కరుణానిధి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖలో సవివరంగా పేర్కొన్నారు.