కన్నావారి సొల్లు కబుర్లు

 

మంత్రి కన్నా లక్ష్మినారాయణ తన రచ్చబండ కార్యక్రమాన్ని సైతం రద్దు చేసుకొని రెక్కలు కట్టుకొని మరీ సోనియమ్మ ముందు వాలి రహస్య మంతనాలు చేసివచ్చిన తరువాత, కిరణ్ కుర్చీలో ఆయనే కూర్చోబోతున్నడనే వార్తలు రావడంతో, అటువంటి వార్తలు వింటూ మనసులో ఆనందం పొంగిపోరలుతున్నపటికీ, పైకి మాత్రం అసలు సిసలయిన రాజకీయనాయకుడిగా చిరంజీవి కంటే బాగా నటించక తప్పలేదు.

 

అసలు అధిష్టానం తనను రమ్మని పిలువలేదని కానీ తానే సమైక్యాంధ్ర కోసం వెళ్లి సోనియమ్మని కలిసొచ్చానని, కానీ గిట్టని వారు తనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ వచ్చిందని, అందుకు ప్రతిగా రాష్ట్ర విభజనకు సహకరించేందుకు అంగీకరించినట్లు ప్రచారం చేస్తున్నారని, కానీ తను అచ్చమయిన సమైక్యవాదినని, అచ్చు బొత్స సత్తి బాబు లాగానే ఆవేదన ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేసారు.

 

అయితే రాష్ట్ర విభజన ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తున్న ఈ తరుణంలో ఆయన రచ్చబండ మీద నుండి నేరుగా హనుమంతుడిలా డిల్లీకి లంగించి తల్లి సోనియా ముందు వాలి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరానని చెపుతున్నారు. అదే కొంచెం నమ్మ బుద్ది కావడం లేదు. అయితే ఆయన మిగిలిన వారిలా కాకుండా తాను ముఖ్యమంత్రి రేసులో లేనని చెప్పడం ద్వారా రేసులో తన ప్రాధమిక అర్హతను స్వయంగా నిర్దారించుకొనడంమెచ్చుకోవలసిందే.