తెలంగాణలో కమలం హవా!?
posted on Aug 2, 2022 @ 4:45PM
దేశంలో విపక్షాలన్నీ బీజేపీ, మోడీ సర్కార్ మీద కారాలూ మీరాలూ నూరుతున్నప్పటికీ కమలం పార్టీ పట్ల తెలంగాణలో మాత్రం సానుకూలత వ్యక్తం అవుతున్నదని అంటున్నారు. ముఖ్యంగా కమలం శ్రేణులు తెలంగాణాలో బీజేపీకి తిరుగే లేని పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు. ఇందుకు తార్కానంగా ఇతర పార్టీల నుంచి చేరికలు పెరుగుతున్నాయనీ, ముందు ముందు ఇంకా పెరుగుతాయనీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణాలో టీఆర్ ఎస్ సర్కార్ పట్ల ప్రజలకు విము ఖత పెరిగిందని అందువల్ల వారు బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారని బీజేపీ నేత ఈటెల రవీందర్ ఘంటాపథంగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో బీజేపీ పాలన, సిద్ధాంతాలు, మోదీ పాలనా తీరు పట్ల ఆకర్షితులయి తెలంగాణలో బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నవారి జాబితాను ఆయన తయారు చేశారు. తెలంగాణాలో బీజేపీ ఈసారి అధికార పగ్గాలు చేపట్టాలన్న పట్టుదలతో ఉంది. ఈ మేరకు పార్టీ ఆకర్ష్ కార్య్రకమం చాలా విజయ వంత మయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ ఎస్ పాలనతో విసిగెత్తి ఆ పార్టీవారే చాలామంది తమ పార్టీ తీర్ధం తీసుకోవడానికి ముందుకు వచ్చారని ఇటీవలే ఈటెల అన్నారు. అలాంటి వారి జాబితా ను తయారు చేసి ఈటెల, డి.కె.అరుణ ఢిల్లీలో బీజేపీ సీనియర్లతో సమావేశమయేందుకు వెళ్లారు.
ఇపుడు తెలంగాణాలో గులాబీ పార్టీకి వ్యతిరేక పవనాలే వీస్తున్నాయని, ఈ సమయాన్ని అవకాశాన్ని తమ కు అనుకూలం చేసుకుని పార్టీ అధికారంలోకి రావడానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అధిష్టానం ఆదేశాల మేరకు ఇక్కడ బండి సంజయ్ నాయకత్వంలో కమలనాథులు దూకుడుగా వ్యవహరి స్తున్నారు.
టీఆర్ఎస్ కంటే బీజేపీతో ఉంటేనే మేలు అనే భావన ప్రజల్లో, నాయకుల్లో వచ్చిందని అందు కే గులాబీ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ సమ యంలోనే బీజేపీ వర్గాలు ప్రజలను, నాయకులను తమ పార్టీలోకి ఆకట్టుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధిష్టానం ఈటెల రాజేందర్‌కు చేరికల కమిటీ బాధ్యత అప్పగించింది. దీంతో ఆయన చేరికల ప్రోత్సాహానికి శక్తివంచన లేకండా కృషి చేసి కమలం తీర్థంపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్న వారి జాబితాతో బీజేపీ అగ్రనాయకత్వం వద్దకు వెళ్లారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి సహా వివిధ పార్టీలకు చెందిన 18 మంది ముఖ్య నేత లు, దాదాపు వంద మంది ఇతర నేతల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, మరో మాజీ మంత్రి ఒకరు బీజేపీ ముఖ్యులకు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరితో ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిగినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, రైస్ మిల్లర్స్ అసోసియేష న్ నాయకుడు మోహన్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి తదితరులు బీజేపీలో చేరను న్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరితో పాటు మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ కూడా పార్టీలో చేరే అవకాశం ఉందని పేర్కొ న్నాయి.