నిన్ను గ్యాంగ్ రేప్ చేస్తాం.. జర్నలిస్ట్ కు హెచ్చరిక
posted on Feb 18, 2016 @ 2:05PM
ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్న ఆడవాళ్లపై అరాచకాలు ఆగవు. ఇప్పటికే రోజుకో ఘటన చూస్తూనే ఉన్నాం.. రోజుకో వార్త వింటూనే ఉన్నాం. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం వింటే మాత్రం కాస్త ఆశ్చర్యపోవాల్సిందే. అదేంటంటే.. ఒకటి రెండు రోజుల్లో నిన్ను గ్యాంగ్ రేప్ చేస్తామంటూ ఓ మహిళా జర్నలిస్టును ఓ వ్యక్తి ట్విట్టర్‌లో హెచ్చరించడం. వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంటూ.. అందరూ మాట్లాడుకునే విషయం ఏంటంటే జెఎన్‌యూ వివాదం గురించి. దీనిలో భాగంగానే న్యాయవాదులు జర్నలిస్ట్ లపై దాడి చేసినందుకు గాను ముంబైలో విలేకరులు నిరసన ప్రదర్శన నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ మహిళా జర్నలిస్టు తన సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసింది. అయితే అమరేందర్ సింగ్ అనే వ్యక్తి ఆమెను బదిరిస్తూ ఒకటిరెండు రోజుల్లో నీపై తీవ్రమైన గ్యాంగ్ రేప్ జరుగుతుంది, స్పృహలోకి రండి, భారతమాతతో చెలగాటమాడకండి అంటూ అతను ట్వీట్ చేశాడు. దీంతో ఆమె భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై ఐపిసి సెక్షన్లు 354 (ఎ)1 (అమర్యాదకరంగా వ్యవహరించడం), 509 (మహిళలను అవమానించే చర్యలకు పాల్పడడం), 506 (నేరపూరిత ఉద్దేశం) కింద ఆజాద్ మైదాన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేయలేదు.