వేటగాడే వేటాడబడుతున్న వేళ
posted on Jul 3, 2012 @ 11:34AM
రియల్‌హీరో, కనిపించని నాలుగో సింహం మేరా పోలీస్ అనిపించుకున్న జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఇప్పుడు అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. నేరస్తులను వేటాడలసిన ఆయన ఇప్పుడు వివాదాలకు గురవడమే కాక మీడియాకు లీక్‌లు చేసి హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు.ఈయన ఎవరిపై విచారణ చేస్తున్నారో వారే లక్షీనారాయణ కాల్‌లిస్ట్‌ను సేకరించి ఆయన్ను ఇరుకున పెట్టడం విశేషం. ఇంజనీరింగ్ డిగ్రీని రీజినల్‌కాలేజ్ (ప్రస్తుతం నిట్‌గా పిలవబడుతుంది) వరంగల్ లో చేసి, చెన్నయ్ ఐఐటిలో ఎంటెక్ చేశారు. సివిల్స్‌లో టాపర్‌గా నిలచిన లక్ష్మీనారాయణ మహరాష్ట్ర కేడర్‌లో సెలక్ట్ అయ్యారు. మొదట నాందేడ్ భాద్యతలు చేపట్టిన ఈయన తర్వాత యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్‌లో పనిచేశారు. డిఐజి ర్యాంకులో జూన్ 12, 2006 సంవత్సరం హైదరాబాద్ నగరంలో సిబిఐ ఆఫీసర్‌గా నియమింపబడ్డారు. లక్ష్మీనారాయణ అదే సంవత్సరం ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. షాబుద్దీన్ ఫేక్ ఎన్‌కౌంటర్ కేసు, సత్యం రామలింగరాజు తప్పుడు ఎకౌంట్లకేసు, అక్రమ మైనింగ్‌లో గాలి జనార్థన్ కేసు ఈయన ఆధ్యర్యంలో ఇన్వస్టిగేట్ చేసిన కేసులు. ఇవన్నీ లక్ష్మీనారాయణకు పేరు తెచ్చిన కేసులనే చెప్పాలి. సత్యం రామలింగరాజు కేసులో ఎన్నో ప్రయాసలకు ఓర్చి ఇన్వెస్టిగేషన్ చేసి వేలకొలది పేజీలు సమర్పించారు. అయితే అక్రమ మైనింగ్ కేసులో సీనియర్ ఐపియస్ అధికారిణి శ్రీలక్షిని అరెస్టు చేసి, సబితా ఇంద్రారెడ్డిని వదిలివేశారనే విమర్శలు ఎదుర్కోన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని రెడ్డివర్గమంతా కలసి శ్రీలక్ష్మిని బలిచేశారనే అపవాదువుంది. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే లక్ష్మీనారాయణది, శ్రీలక్ష్మీది ఒకటే కమ్యూనిటీ అయినప్పటికీ ఆయన చలించలేదు.
మే 27, 20012 న జగన్ అరెస్టుతో ఆయన మరింత ప్రచారంలోకి వచ్చారు. జెడి లక్ష్మీనారాయణకు ఈ సమయంలోనే వై కాటగిరి భద్రతను ప్రభుత్వం ఇచ్చింది. ఎమ్మార్ కేసులో అవినీతికి పాల్పడ్డారని ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్న బిపి ఆచార్యను అరెస్టు చేశారు. ఇదే కేసులో రఘురామకృష్ణంరాజు అనే ఇండస్ట్రియలిస్ట్‌కి ముచ్చెమటలు పట్టించారు. ఈయన రాజ్యసభ సబ్యులైన కెవిపి రామచంద్రరావుకు బందువుకూడా .రఘరామకృష్ణంరాజును విచారణ జరుపుతున్నప్పుడే లక్ష్మీనారాయణ ఒక వర్గం మీడియాకు సమాచారం అందిస్తున్నారని కృష్ణంరాజు కాల్‌లిస్టును కోర్టుకు అందించారు. అప్పటినుండే జెడి లక్ష్మీ నారాయణను కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని చెప్పవచ్చు. క్విడో ప్రో కో అంటూ జగతి పబ్గికేషన్స్ ఇన్వస్టర్లని అరెస్టు చేశారు. ఇందుకు వైయస్ జగన్‌ను కూడా బాధ్యుడిని చేసి అతనితో పాటు జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలను సిబిఐ అరెస్టుచేసింది. జగతిపబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెట్టినందుకు గాను మాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్‌ని, ఇండియాసిమెంట్స్ అధినేతను, చార్టెడ్ ఎకౌంటెంట్ సాయిరెడ్డిని, ఎమ్మార్ కేసులోని పారిశ్రామిక నేతల్ని, నెలలతరబడి విచారణ పేరుతో వేధింపులకు పాల్పడ్డారనే అపవాదును కూడా మూటగట్టుకున్నారు. కాని ఇప్పుడు పరస్ధితి తారుమారైంది. నేరసుస్ధులను వేటాడటానికి వచ్చిన లక్షీనారాయణను ఆ నేరస్తులే వేటాడుతున్న పరిస్ధితి ఏర్పడిరది. కాల్ లిస్ట్ వ్యవహారంలో ఆయనే హైకోర్టు బోను ఎక్కి తలవంచుకుని నిలబడాల్సి వస్తోంది.